»   » ‘బెంగాల్ టైగర్’ ఫంక్షన్, రవితేజ నో చెప్పాడు (ఫోటోస్)

‘బెంగాల్ టైగర్’ ఫంక్షన్, రవితేజ నో చెప్పాడు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవితేజ, తమన్నా, రాశి ఖన్నా ముఖ్య తారాగణంగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బెంగాల్ టైగర్'. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఆడియో సక్సెస్ అయిన నేపథ్యంలో హైదరాబాద్ లోని తాజ్ దక్కన్ హోటల్ లో ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించారు.

సాధారణంగా ఇలాంటి వేడుకల్లో హీరోలు సినిమా అదిపోయింది, సూపర్ అంటూ డబ్బా కొట్టుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే రవితేజ మాత్రం ఇందుకు నో చెప్పారు. సినిమా గురించి ఇపుడు మేము మాట్లాడే కంటే సినిమా సక్సెస్ మాట్లాడితేనే బావుంటుంది. సినిమా సక్సెస్ అయి నిర్మాత ఆనందంగా ఉండాలి, దర్శకుడికి ముందుగా ఆల్ ది బెస్ట్' అని చెప్పారు.


దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ...సినిమా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. డిసెంబర్ 10న బెంగాల్ టైగర్ బాక్సాపీసును వణికిస్తుంది. మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా అలరిస్తుందనితెలిపారు. రాఖి ఖన్నా, తమన్నా తదితరులు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.


స్లైడ్ షోలో ఫోటోస్...


బెంగాల్ టైగర్
  

బెంగాల్ టైగర్

డిసెంబర్ 10న ‘బెంగాల్ టైగర్' విడుదలకు సిద్ధమవుతోంది.


సంగీతం
  

సంగీతం

ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఆడియో సక్సెస్ అయిన నేపథ్యంలో హైదరాబాద్ లోని తాజ్ దక్కన్ హోటల్ లో ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించారు.


మాస్, క్లాస్
  

మాస్, క్లాస్

డిసెంబర్ 10న బెంగాల్ టైగర్ బాక్సాపీసును వణికిస్తుంది. మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా అలరిస్తుందని దర్శకుడు తెలిపారు.


నటీనటులు
  

నటీనటులు

ఈ సినిమాలో ఇంకా బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, రావు రమేష్, షాయాజీ షిండే, నాజర్, పోసాని కృష్ణ మురళీ, తనికెళ్ల భరణి, హర్షవర్ధన్ రానె, సురేఖా వాణి, అక్ష, శ్యామల, ప్రియ, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదతరులు నటించారు.


తెర వెనక
  

తెర వెనక

ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సంగీతం: బీమ్స్, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంపత్ నంది.


Please Wait while comments are loading...