రవితేజ ‘బెంగాల్ టైగర్’ సెన్సార్ రిపోర్ట్

By Bojja Kumar

హైదరాబాద్: రవితేజ, తమన్నా, రాశి ఖన్నా ముఖ్య తారాగణంగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బెంగాల్ టైగర్'. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. డిసెంబర్ 10న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. U/A రేటింగ్ ఇచ్చారు.

ఈ చిత్రంలో రవితేజ తను అమితంగా ప్రేమించే తండ్రిని చంపిన విలన్స్ ని సంహరించి, పగ తీర్చుకునే కొడుకుగా కనిపించనున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా సాగనుందని తెలుస్తోంది. ర‌వి తేజ స‌ర‌స‌న త‌మన్న, రాశి ఖ‌న్నాలు ఆడిపాడ‌ునున్నారు.

సంప‌త్ నంది రెండ‌వ సినిమా ర‌చ్చ‌లో కూడా త‌మ‌న్న‌నే హీరోయిన్ కావ‌డం విశేషం. ఏమైంది ఈ వేళ‌తో ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కునిగా పేరు తెచ్చుకున్నాడు. రెండ‌వ సినిమాతోనే రామ్ చ‌ర‌ణ్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేశాడు. ర‌చ్చ త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్‌2 కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం వ‌చ్చింది.

Bengal Tiger received U/A

ఆ సినిమా స్రిప్టు త‌యారు చేసే ప‌నిలో దాదాపు 2 సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి. కార‌ణం ఏంటో తెలియ‌దు కాని ఆ సినిమా నుంచి సంప‌త్ నంది త‌ప్పుకున్నాడు. అనూహ్యంగా ర‌వితేజను డైరెక్ట్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. ర‌వితేజకు త‌మ‌న్న‌తో తొలి సినిమా.

బెంగాల్ టైగర్ లో ఇంకా బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, రావు రమేష్, షాయాజీ షిండే, నాజర్, పోసాని కృష్ణ మురళీ, తనికెళ్ల భరణి, హర్షవర్ధన్ రానె, సురేఖా వాణి, అక్ష, శ్యామల, ప్రియ, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదతరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సంగీతం: బీమ్స్, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంపత్ నంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X