twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజకు మళ్లీ బ్యాడ్ టైమ్..?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మాస్ మహారాజ్ రవితేజ ఇటీవలే ‘కిక్-2' సినిమాతో పరాజయం చవిచూసిన సంగతి తెలసిందే. ఈ సినిమా పెద్దగా ఆడక పోయినా త్వరలో ‘బెంగాల్ టైగర్' వస్తుంది, పెద్ద హిట్టవుతుందనే ధీమాతో ఉన్నారు రవితేజ అభిమానులు. అయితే పరిస్థితి చూస్తుంటే రవితేజ బ్యాడ్ టైమ్‌ తప్పేట్లు లేదని అంటున్నారు.

    బెంగాల్ టైగర్ చిత్రాన్ని వాస్తవానికి దసరా సీజన్లో విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఇదే సమయంలో రామ్ చరణ్ ‘బ్రూస్ లీ', అక్కినేని అఖిల్ నటించిన ‘అఖిల్' విడుదల ఉండటంతో దీపావళికి వాయిదా వేసారు. అయితే ట్రేడ్ వర్గాల నుండి అందుతున్నసమాచారం ప్రకారం ‘బెంగాల్ టైగర్' దీపావళికి విడుదలయ్యే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది.

    Bengal Tiger release postponed

    సంక్రాంతికి విడుదల చేద్దామని నిర్మాతలు భావించినా ఆసీజన్లో నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ సినిమా ఉండటంతో చోటు దొరకలేదని టాక్. దీంతో నవంబర్ చవరి వారంలోగానీ, డిసెంబర్ మొదట్లోగాని విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగు సినిమాలకు పెద్దగా బిజినెస్ జరుగని సీజన్ ఇది. గతంలో ఈ సమయంలో విడుదలై సినిమాలు పెద్దగా ఆడలేదు. అందుకే పెద్ద సినిమాలు ఈ బ్యాడ్ సీజన్ కు దూరంగా ఉంటాయి. ఈ సమయంలో ‘బెంగాల్ టైగర్' విడుదలైతే కష్టాలు తప్పవని అంటున్నారు.

    అయితే నిర్మాతల నుండి మాత్రం సినిమా రిలీజ్ వాయిదా విషయమై ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు. మా చిత్రం బెంగాల్ టైగర్ ని దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని ఇటీవల రాధామోహన్ వెల్లడించారు. అయితే ఆయన అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేస్తే ఫర్వాలేదు కానీ వాయిదా పడితేనే సమస్య.

    ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హ‌వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు న‌టించారు.

    బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, సంగీతం భీమ్స్‌, నిర్మాత‌: కె.కె.రాధామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.

    English summary
    Film Nagar source said that, Bengal Tiger is eyeing for late November or early December release, which is not a good season for Telugu cinema business.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X