రెండ్రోజుల క్రితం స్నేహితురాలి మృతి.. ఇప్పుడు నటి అనుమానాస్పద మృతి?
ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. ఎలాంటి సమస్యలు సీరియస్ గా తీసుకోవాలి ఎలాంటి సమస్యలు సీరియస్ గా తీసుకో కూడదు అనే విషయం కూడా అర్థం చేసుకోకుండా చిన్న వయసు వారు మొదలు పెద్దవయసు వారి దాకా ఏ మాత్రం ఆలోచించకుండా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు కలకత్తాలో మోడల్స్ గా పని చేస్తూ నటీమణులు మారాలని ప్రయత్నిస్తున్న ఇద్దరు 2 రోజుల వ్యవధిలో చనిపోవడం సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే

15 రోజుల్లో
పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో మోడల్స్ వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం ఒక మోడల్ మృతి చెందగా ఇప్పుడు తాజాగా మరో మోడల్ మృతి చెందింది. పటౌలీ ప్రాంతంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న ఆ మోడల్‌ను మంజుషా నియోగిగా గుర్తించారు పోలీసులు. గడిచిన 15 రోజుల్లో కోల్‌కతాలో ముగ్గురు మోడళ్లు చనిపోయారు. అయితే ఆమె స్నేహితురాలు, మోడల్ కం నటి అయిన బిదిషా డీ మజుందార్ రెండు రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో చనిపోయింది.

డిప్రెషన్‌తోనే
తనకు చాలా సన్నిహితురాలైన స్నేహితురాలి మృతితో మంజుషా డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు మంజుషా తల్లి తెలిపారు. దీంతో మంజుషా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నటి మంజూష నియోగి మృతదేహాన్ని ఈ ఉదయం పాటూలి ఇంటి నుంచి వెలికితీశారు. ఆమె ఇటీవల మరణించిన బిదిషా డి మజుందార్‌కి సన్నిహితురాలు. తన స్నేహితురాలి మరణంతో మంజూష డిప్రెషన్‌తో బాధపడుతోందని కుటుంబ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ డిప్రెషన్‌తోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? అనే విషయం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లయ్యాక
పెళ్లయిన మంజూష నాలుగైదు రోజుల క్రితం తండ్రి ఇంటికి వచ్చింది. మరణించిన నటి మంజూష తల్లి చెబుతున్న దాని ప్రకారం, "బిదిషా ఆమెకు మంచి స్నేహితురాలు. వారిద్దరూ కలిసి చాలా షూట్స్ చేసారు. ఆమె నిన్న రోజంతా బిదిషా గురించి మంజూష మాట్లాడుతుంది. నేను కూడా బిదిషాలా చేస్తానని మంజూష చెబుతూనే ఉందని ఆమె పేర్కొన్నారు. మంజూష తల్లి "నిన్న కూడా మంచి మనసుతో షూటింగ్ నుంచి వచ్చామని పేర్కొన్నారు. పెళ్లయ్యాక అల్లుడు ఇక మోడలింగ్ చేయాల్సిన అవసరం లేదని అన్నాడని అన్నారు..

ఎవరూ బాధ్యులు కారని
ఈ ఇండస్ట్రీలో ఉండేందుకు.. ఆమె శరీరం సన్నగా ఉంచుకునేందుకు ఆమె తక్కువ తినేది, త్రాగేది, నేను కూడా ఆమెకు బాగా తినమని చెప్పాను, తినకపోతే, అనారోగ్యం వస్తుందని కూడా చెప్పను కానీ అంతకుముందే, ఆమె మనకి దూరం అయింది అంటూ ఎమోషనల్ అయ్యారు. సరిగ్గా రెండు రోజుల బ్రైడల్ మేకప్ ఫోటో షూట్స్ చేసే బిదిషా మజుందార్ కూడా ఉరి వేసుకుంది. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని బిదిషా సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

వరుస మరణాలు
అవకాశాలు రాకపోవడం, ఆర్థిక సమస్యలతో పాటు ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఇక ఈ రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు వారాల క్రితం మరో పాపులర్ టీవీ నటి పల్లబి డే కూడా తన ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. దీంతో మోడల్స్ వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications