ఇటీవలే భర్తతో విడిపోయి.. హోటల్ రూంలో మరణించిన నటి!
Recommended Video

పాయల్ చక్రవర్తి ప్రముఖ నటిగా బెంగాలీ చిత్రాలు, సీరియల్స్ లో నటిస్తోంది. పాయల్ చక్రవర్తి తాజగా హోటల్ గదిలో మరణించిన వార్త సంచలనంగా మారింది. అనుమానాస్పద పరిస్థితితుల నడుమ ఆమె శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుండా లేక వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.

భర్తతో విడిపోయి
ఇటీవల పాయల్ తన భర్త నుంచి విడిపోయినట్లు తెలుస్తోంది. విడాకులు తీసుకుని భర్త నుంచి కొంత కాలంగా పాయల్ దూరంగా ఉంటోంది. 36 ఏళ్ల పాయల్ కు చిన్నారి బాబు కూడా ఉన్నాడు. తన కొడుకుతో కలసి పాయల్ తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు తెలుస్తోంది.

హోటల్ గదిలో
బుధవారం రోజు ఓ హోటల్ గదిలో పాయల్ బస చేసినట్లు తెలుస్తోంది.హోటల్ సిబ్బంది కొంత సేపు గది తలుపులు కొట్టినా ఆమె స్పందించలేదు. దీనితో తలుపులు పగలగొట్టారు. పాయల్ చక్రవర్తి అనుమానాస్పద కరంగా మరణించి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసుల
పాయల్ మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతికి సంబందించిన వివరాలు ఆరా తీస్తున్నారు. ఆమె మృత దేహాన్ని పోస్ట్ మార్టం కొరకు పంపారు. వెస్ట్ బెంగాల్ లోని సిలిగురి నగరంలో ఈ ఘటన జరిగింది.

సహనటులు
పాయల్ మృతితో ఆమె సహచర నటులు విషాదంలో ఉన్నారు. పాయల్ మృతికి సంబందించిన కారణాలని పోలీసులు వారిని అడిగి కూడా తెలుసుకోనున్నారు. పాయల్ అసలు ఆ హోటల్ గదికి ఎందుకు వెళ్లిందో ఇప్పటికి తెలియలేదు. పోలీసులు ప్రాధమికంగా మాత్రం ఇది ఆత్మహత్యే అని అనుమానిస్తున్నారు.


Click it and Unblock the Notifications











