నటి హేమ మెడకు బిగుస్తున్న డ్రగ్ కేసు ఉచ్చు.. అలా షాకిచ్చిన బెంగళూరు పోలీసులు!

Bangalore Rave Party Case: ఇండ్రస్టీని షేక్ చేసిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సినీ నటి నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. అలాగే ఆమె ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకున్నట్లుగా మెడికల్ రిపోర్టు జతపర్చారు. దీంతో ఈ కేసులో నటి హేమ కీలకంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఆమె 14 రోజులు జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా మే 19న బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ నిర్వహించినట్టు నటి హేమ, చిత్తూరుకు చెందిన డాక్టర్ రణధీర్ బాబుతోపాటు 9మందిపై ఛార్జీ షీట్ దాఖలు అయిందని తెలుస్తోంది. అందులో వాసు, రణధీర్ బాబు, అరుణ్ కుమార్, నాగబాబు, అబూబక్కర్ తోపాటు నైజీరియన్ పైన అభియోగాలు నమోదయ్యాయి. హేమ ఫ్రెండు వాసు పార్టీకి పిలిచినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ కేసులో భాగంగా బెంగళూరు పోలీసులు 1,086 పేజీల ఛార్జ్ షీట్‌ను దాఖలు చేశారు.

Bengaluru police has filed a charge sheet against Tollywood actress Hema for participating in a Bangalore rave party

అసలేం జరిగిందంటే..?

బెంగళూరులోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరిట పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారని పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్ లో పోలీసులకు భారీ మొత్తంలో డ్రగ్స్, కొకైన్ లభ్యమయ్యాయి. ఈ పార్టీ తెలుగు రాష్ట్రాల సెలబ్రెటీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఫామ్‌హౌస్ యజమాని గోపాల్ రెడ్డి, పార్టీ నిర్వాహకులుగా అరుణ్ కుమార్, రణధీర్ బాబు పేర్లు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ డ్రగ్ప్ తీసుకున్నారనే అభియోగాలు నమోదయ్యాయి. దీంతో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కావాలనే ఈ కేసులో నన్ను ఇరికిస్తున్నారని హేమ ఆరోపించింది.

ఈ క్రమంలోనే నటి హేమ కేసు నుంచి తనకు మినహాయింపునివ్వాలని బెంగళూరు కోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్థనను స్వీకరించిన కోర్టు.. ఇరు పక్షాల వాదనలు విని.. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ను బెంగళూర్ కోర్టు దాఖాలు చేసింది. అయితే.. బెంగళూర్ రేవ్ పార్టీ నిర్వహణలో కీలక పాత్ర పోషించడంతో పాటు పార్టీలో డ్రగ్స్ వాడకంపై పోలీసులు వేసిన చార్జ్‌షీట్‌పై బెంగళూరు కోర్టు విచారణ చేపట్టింది.

అయితే.. ఈ కేసు దర్యాప్తులు నటి హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్‌ గానీ, నిషేధిత పదార్ధాలను గానీ పోలీసులు స్వాధీనం చేసుకోలేదని ఆమె తరపు న్యాయవాది కోర్టులో పేర్కొన్నారు. ఈ క్రమంలో బెంగళూర్ రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్న సాక్ష్యాలను బెంగళూరు పోలీసులు కోర్టుకు అందజేశారు. ఇరు పక్షాల వాదోపవాదలు విన్న కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Bengaluru police has filed a charge sheet against Tollywood actress Hema for participating in a Bangalore rave party

ఇదెలా ఉంటే.. ఈ డ్రగ్స్ టాలీవుడ్ తీవ్ర దూమారం రేపింది. దీంతో నటీ హేమ సభ్యత్వాన్ని 'మా' రద్దు చేసింది. కానీ, ఆ తర్వాత ఆగస్టులో ఆమెపై విధించిన 'మా' బ్యాన్ ఎత్తివేసింది. హేమ పేరు ఛార్జీ షీట్‌లో ఉందని వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది. నేను డ్రగ్స్ తీసుకోలేదని, బెంగళూరు పోలీసులు ఛార్జీ సీట్‌లో తన పేరు ఉన్నట్టు మీడియా ద్వారానే తనకు తెలిసిందన్నారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదనీ, తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే.. దేనికైన రెడీ అంటున్నారు. పోలీసుల ఛార్జ్ షీట్ తనకు వచ్చిన తరువాతనే ఈ విషయంపై స్పందిస్తానని పేర్కొన్నారు. ఇప్పటివరకు తనకు ఉన్న సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్టులో నెగిటివ్ అన్నారు. తాను ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకోలేదుని, కొన్ని మీడియాలో వచ్చిన వార్తల కారణంగానే తనపేరు ఛార్జ్ షీట్‌లో పెట్టారని చెప్పుకొచ్చారు నటి హేమ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X