»   » నటి కేథరిన్‍‌ను పెళ్లాడిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సింగర్ (ఫోటోస్)

నటి కేథరిన్‍‌ను పెళ్లాడిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సింగర్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో సినీ నేపథ్య గాయకుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునన బెన్నీ దయాళ్ ఇంటివాడయ్యాడు. బెన్నీ తన స్నేహితురాలు, మోడల్, నటి కేథరిన్ తంగమ్‌ను పెళ్లాడారు. బెంగుళూరులో జూన్ 5న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కొద్ది మంది ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.

బెన్నీ దయాళ్ దుబాయ్ లో పుట్టారు. వారిది కేరళకు చెందిన ఫ్యామిలీ. కొన్ని మళయాలం చిత్రాల్లో కూడా ఆయన నటించారు. సింగర్ గా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం వివిధ బాషల్లో బిజియెస్ట్ సింగర్ గా పేరు కొనసాగుతున్నారు.

ఇండియాలోని అగ్రశ్రేణి మ్యూజిక్ డైరెక్టర్లందరితో బెన్నీ దయాళ్ పని చేసారు. దీంతో ఆయన పెళ్లి వేడుకకు పలువురు సినీ సంగీత ప్రముఖులు హాజరయ్యారు. ఏఆర్ రెహమాన్, విశాల్ దల్దానీ, నీతి మోహన్, మరికొందరు సింగర్స్ హాజరయ్యారు. నవదంపతులకు విషెస్ చెబుతూ పలువురు ప్రమఖులు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసారు.

బెన్నీ దయాళ్ తెలుగులో కూడా చాలా పాటలు పాడారు. తెలుగులో ఆయన తొలిసారి పవన్ కళ్యాణ్ నటించిన 'జల్సా' మూవీలో 'జెన్నిఫర్ లోపెజ్' అనే సాంగ్ పాడారు. తర్వాత రామ్ నటించిన 'రెడీ' మూవీలో అయ్యో అయ్యో అయ్యో దానయ్యా, 'ఏమాయ చేసేవే' మూవీలో కుందనపు బొమ్మా సాంగ్, ఇటీవల వచ్చిన '24' మూవీలో కాలం నా ప్రేయసి సాంగ్, పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' మూవీలో టైటిల్ సాంగ్ పాడారు.

స్లైడ్ షోలో బెన్నీ దయాళ్ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోస్...

బెన్నీ దయాళ్- కేథరిన్ తంగమ్‌

బెన్నీ దయాళ్- కేథరిన్ తంగమ్‌


బెన్నీ దయాళ్ తన స్నేహితురాలు, మోడల్, నటి కేథరిన్ తంగమ్‌ను పెళ్లాడారు.

రెహమాన్

రెహమాన్


బెన్నీ దయాళ్- కేథరిన్ తంగమ్‌ వివాహ వేడుకలో ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్.

సందడి

సందడి


బెన్నీ దయాళ్, కేథరిన్ పెళ్లి వేడుకలో స్నేహితుల సందడి.

నీతి మోహన్

నీతి మోహన్


బెన్నీ దయాళ్- కేథరిన్ తంగమ్‌ వివాహ వేడుకలో ప్రముఖ బాలీవుడ్ సింగర్ నీతి మోహన్.

విశాల్ దల్దాని

విశాల్ దల్దాని


బెన్నీ దయాళ్- కేథరిన్ తంగమ్‌ వివాహ వేడుకలో ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్వకుడు విశాల్ దల్దాని.

పెళ్లి వేడుక

పెళ్లి వేడుక


బెంగుళూరులో జూన్ 5న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కొద్ది మంది ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.

English summary
Singer Benny Dayal married his model girlfriend Catherine Thangam in a close-knit ceremony on June 5 in Bangalore. His colleagues from Bollywood - singers Neeti Mohan, A R Rahman and Vishal Dadlani - shared beautiful pictures from the wedding on Sunday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu