సౌత్ స్కోప్ అవార్డ్స్ లో పెళ్ళికాని హీరోయిన్-పెళ్లైన హీరో జంటకి బెస్ట్ కపుల్ అవార్డ్

By Sindhu

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ రూపొందించి నిర్వహిస్తున్న దక్షిణ భారత సినిమా వార్త విశేషాల సమాహారం 'సౌత్ స్కోప్" మాసపత్రిక. ఈ పత్రిక గత సంవత్సరంగా సినిమా అవార్డుల వేడుకను నిర్వహిస్తుంది. అందులో బాగంగానే 2009సంవత్సరానికి గాను అవార్డుల ప్రదానోత్సవం 19 సెప్టెంబర్ ఆదివారం నాడు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్య క్రమంలో తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ రంగాలవారికి అవార్డులు ఇచ్చింది. ఈ సినిమా అవార్డ్ ల వేడుకకు ప్రభుదేవా, నయనతార కలిసి రావడం పలువురు దష్టిని ఆకర్షించింది. ఇంకా డి రామానాయుడు, చిరంజీవి, బోనీకపూర్, పునీత్ రాజ్ కుమార్, శ్రీదేవి, అల్లు అరవింద్ తదితరులు హజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమానికి దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలకు చెందిన అతిరధ మహారధులు హాజరయ్యారు.

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అంతా తానే అయి తన డాన్సులతో, నటనతో వేదిక మొత్తాన్ని ఉత్సాహంతో హొరెత్తించాడు. మైఖేల్ జాక్సన్, చిరంజీవి, ప్రభుదేవా ట్యూన్స్ కు స్టెప్పు లేసి ఆహుతులను అలరించాడు. అంతే కాకుండా ప్రభుదేవాతో కలసి చేసిన మూన్ వాక్ డాన్సు సూపర్బ్ నంబర్.

ఈ వేడుకకు సంబంధించిన అవార్డుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

ఉత్తమ చిత్రం: మగధీర
ఉత్తమ నటుడు: రామ్ చరణ్ తేజ (మగధీర)
ఉత్తమ నటి: అనుష్క(అరుంధతి)
సౌత్ స్కోప్ లైఫ్ టైం అచ్చివ్ మెంట్: డా.డి.రామానాయుడు
ఉత్తమ చాయాగ్రాహకుడు: సెంథిల్ కుమార్(మగధీర)
ఉత్తమ దర్శకుడు: రాజమౌళి(మగధీర)
ఉత్తమ సహాయక నటుడు: సోను సూద్(అరుంధతి)
ఉత్తమ సహాయక నటి: రమ్య కృష్ణ (కొంచెం ఇష్టం కొంచెం కష్టం) అభినయ(తమిళం), సుహాసిని(మలయాళం), అంజన(కన్నడ)
ఉత్తమ హాస్య నటుడు: బ్రహ్మానందం(కొంచెం ఇష్టం కొంచెం కష్టం), వివేక్(తమిళం), సలీంకుమార్(మలయాళం)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్(ఆర్య 2), హారీస్ జైరాజ్ (తమిళం), విద్యాసాగర్(మలయాళం)
ఉత్తమ నేపధ్య గాయకుడు: అనుజ్ (మగధీర - పంచదార బొమ్మ)
ఉత్తమ నేపధ్య గాయని: గీత మాధురి (ఏక్ నిరంజన్ - గుండెల్లో గిటారు)
ఉత్తమ పాటల రచయిత: చంద్రబోస్ (మగధీర - పంచదార బొమ్మ) ఎన్. ముత్తుకుమార్(తమిళం), శరత్ చంద్రవర్మ(మలయాళం), జైహింద్(కన్నడ)
ఉత్తమ నూతన కధానాయకుడు: నాగ చైతన్య (జోష్)
బెస్ట్ క్లోజ్ అప్ కపుల్: ప్రభుదేవా-నయనతార

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X