Just In
- 38 min ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 1 hr ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 1 hr ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- 1 hr ago
రొమాన్స్‌లో మునిగితేలారు.. అది అలవాటుగా కాదట.. భర్త ఒళ్లో వాలిన పూజా రామచంద్రన్
Don't Miss!
- Sports
IPL 2021: చెన్నై జట్టులోకి రాబిన్ ఊతప్ప.. మీరు మారరంటూ ఫ్యాన్స్ ఫైర్!
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- News
అనంత కలెక్టర్‌ను కదిలించిన ఫేస్బుక్ పోస్ట్: 24 గంటల్లోనే బస్సు: స్టూడెంట్స్‌తో కలిసి ప్రయాణం
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లైఫ్ లో బెస్ట్ డే : పవన్ కళ్యాణ్ ఐ లవ్ యు చెప్పారు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయనతో సినిమా చేయాలని దాదాపుగా ప్రతి దర్శకుడు, టెక్నీషియన్ కోరుకుంటారు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ తో పని చేసే అవకాశం దక్కించుకున్న సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తన అనుభవాలను పంచుకున్నారు.

అనూప్ రూబెన్స్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘గోపాల గోపాల' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా అనూప్ రూబెన్స్ పని తీరు చూసి ప్రశంసించారట పవన్ కళ్యాణ్. ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ నన్ను పిలిచి...ఐ లవ్ యు అనూప్, త్వరలోనే మనం కలిసి పని చేస్తాం అన్నారు. నా లైఫ్ లో ఇది బెస్ట్ డే' అంటూ అనూప్ తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా వెల్లడించారు.
#PSPK OMG!Best day of my life!!!Pawan Kalyan sir just called and said'I Luv u Anup!'Next line he said was'We are working soon!'Delighted :D
— anuprubens (@anuprubens) December 16, 2014
వెంకటేష్, పవన్‌కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో మల్టీస్టారర్ చిత్రంగా రూపొందుతున్న ‘గోపాల గోపాల' చిత్రం జనవరి 14న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అదే విధంగా ఆడియోను 28న విడుదల చేయనున్నారు. వెంకటేష్ సరసన శ్రీయ కథానాయికగా నటించిన చిత్రంలో పవన్‌కళ్యాణ్ కృష్ణుడిగా కనిపిస్తాడు. ఇద్దరు పెద్ద హీరోలు కావడం, సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రంలో కేవలం మూడే పాటలు ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ఐదు నుంచి ఆరు పాటలు మన సినిమాల్లో ఉంటూంటాయి. అందులోనూ వెంకటేష్, పవన్ లాంటి వారి చిత్రాలంటే ఆడియోపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అలాంటిది మరీ మూడే అనేది ఆశ్చర్యకరమైన విషయం అంటున్నారు. అయితే సినిమా ఫ్లో దెబ్బతినకుండా ఇలా ప్లాన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.