అల్లరి నరేష్ సినిమాకు భారీ డిమాండ్.. విడుదలకు ముందే అన్ని కోట్లు వచ్చాయా..?

అల్లరి నరేష్ అనగానే అందరికి కామెడీ సినిమాలే గుర్తొస్తాయి. అయితే అలాంటి నటుడితో మంచి ఎమోషనల్ కథలు తెరకెక్కిస్తే వర్కౌట్ అవుతుందని గమ్యం సినిమాతోనే అర్ధమయ్యింది. కామెడీ హీరోగా ఒకప్పుడు చాలా బిజీగా గడిపిన అల్లరి నరేష్ ఇప్పుడు మాత్రం రూట్ మార్చాడు. ఆడియెన్స్ కి కామెడీ పాత్రలు బోర్ కొట్టేశాయని భావించిన నరేష్ మొత్తానికి కొత్త దారిని సెట్ చేసుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన నాంది అనే సినిమాతో రాబోతున్నాడు. ఇక ఆ సినిమా బిజినెస్ కూడా క్లోజ్ అయినట్లు టాక్.

నాంది టీజర్ తోనే హైప్ క్రియేట్ చేసిన నరేష్

నాంది టీజర్ తోనే హైప్ క్రియేట్ చేసిన నరేష్

గత ఏడాది నాంది సినిమా టీజర్ ను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చిన నరేష్ మొత్తానికి కెరీర్ లో చాలా రోజుల తరువాత డిఫరెంట్ హిట్ కొట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది. సినిమా కథ ఎక్కువగా ఒక జైల్లోనే కోనసాగుతుందని అర్ధమవుతోంది. ఇక నేరము చేశారో.. చేయలేదో తెలియని ఖైదీలు జైళ్లలోనే ఏళ్లతరబడి శిక్ష అనుభవిస్తున్నారనే కొత్త పాయింట్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది.

అదే మేజర్ ప్లస్ పాయింట్

అదే మేజర్ ప్లస్ పాయింట్

నేరం చేశారో లేదో తెలియకుండానే అండర్ ట్రైల్ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు.. అనే పాయింట్ మీద సినిమాను తెరకెక్కించారట. అల్లరి నరేష్ లుక్ యాక్టింగ్ ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ అని తెలుస్తోంది. దాదాపు సినిమా కోసం తన శక్తిని మొత్తం ఉపయోగించడానిపిస్తోంది. గత కొంతకాలంగా అపజయాల్లో ఉన్న నరేష్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.

మొత్తం హక్కులను జీ టీవీకే..

మొత్తం హక్కులను జీ టీవీకే..

ఇక ఈ సినిమాకు ఇటీవల ఒక మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం హక్కులను జీ టీవీ వారికి అమ్మేయాలని ప్లాన్ వేశరట. ఒక విధంగా పట్టిన పెట్టిబడికి అది మంచి లాభం అని తెలుస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నాడు. ఇక కోలీవుడ్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, హరీష్, ప్రవీణ్ సరికొత్త పాత్రలతో కనిపించనోతున్నట్లు తెలుస్తోంది.

సినిమాను మొత్తం ఎంతకు అమ్మారంటే..

సినిమాను మొత్తం ఎంతకు అమ్మారంటే..

ఇక సినిమా బిజినెస్ పరంగా నిర్మాతలు హ్యాపీ అయినట్లు సమాచారం. వరల్డ్ నెగిటివ్ రైట్స్ మొత్తం జీటీవీ వారే తీసుకోవాడనికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని చర్చలు జరిగాయని 8 నుంచి 10కోట్ల మధ్యలో డీల్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మాట్లాడుకోవడం మొత్తం అయిపోయిందట అగ్రిమెంట్ ఒక్కటి బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. జీటీవి ద్వారానే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X