»   » టాలీవుడ్లో బెస్ట్ ఫ్రెండ్స్, పార్టీ గ్యాంగ్స్ (ఫోటోస్)

టాలీవుడ్లో బెస్ట్ ఫ్రెండ్స్, పార్టీ గ్యాంగ్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత గుర్తించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే అనే విషయం అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు.

మంచి మనుషులు, మంచి మనసులు ఉన్న ప్రతి చోటా స్నేహం చిగురిస్తుంది. మన టాలీవుడ్లోనూ అంలాంటి మనుషులు, మనసులు చాలా ఉన్నాయి. మరి ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్, పార్టీ గ్యాంగ్స్ గురించి తెలుసుకుందాం.

సమంత

సమంత

టాలీవుడ్లో సమంతకు మంచి ఫ్రెండ్ కాస్టూమ్ డిజైనర్, స్టైలిస్ట్ కోన నీరజ. ఈ విషయాన్ని సమంత కూడా అనేక సందర్భాల్లో వెల్లడించింది. ఇక్కడ ఫోటో చూస్తే వారి మధ్య ఉన్న అనుబంధం గురించి అర్థం చేసుకోవచ్చు.

సుమంత్, మహేష్ బాబు

సుమంత్, మహేష్ బాబు

సుమంత్, మహేష్ బాబు చిన్నతనం నుండి మంచి ఫ్రెండ్స్. ఇప్పుడంటే ఎవరి ప్రొఫెషన్లో వారు బిజీ అయిపోయి, ఈ మధ్య సరిగా కలుసుకోడం లేదు కానీ.... ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది.

శృతి, తమన్నా

శృతి, తమన్నా

శృతి హాసన్, తమన్నా మంచి స్నేహితులు. ఇద్దరూ ఎక్కడ కలిసినా ఇలా చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంటారు.

పవన్-అలీ

పవన్-అలీ

టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ కు మంచి స్నేహితుడు అలీ. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో అలీకి తప్పకుండా ఓ క్యారెక్టర్ ఉంటుంది. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందనడానికి ఇంతకుమించిన ఉదాహరణ అవసరం లేదు.

నాగార్జున, చిరంజీవి

నాగార్జున, చిరంజీవి

టాలీవుడ్లో చిరంజీవి, నాగార్జున మధ్య మంచి స్నేహ బంధం ఉంది. ఇద్దరూ కలిసి గతంలో మాటీవీని స్థాపించారు. కష్టాలు, సుఖాల్లోనూ ఇద్దరూ పాలుపంచుకుంటారు.

రానా, చరణ్

రానా, చరణ్

రామ్ చరణ్, రానా స్కూలు డేస్ నుండే మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందో చెప్పడానికి ఈ ఫోటో చక్కటి ఉదాహరణ.

కాజల్, తమన్నా

కాజల్, తమన్నా

హీరోయిన్ కాజల్, తమన్నా మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసారంటే సందడే సందడి. ఏ మీటింగులో కలిసినా ఇద్దరూ ఒకచోట చేరి ముచ్చట్లలో మునిగిపోతారు.

రాజమౌళి-ఎన్టీఆర్

రాజమౌళి-ఎన్టీఆర్

దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ ఇద్దరూ కెరీర్ దాదాపు ఒకేసారి మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య స్నేహం బాగా పెరిగింది. ఇరుకుటుంబాల్లో ఏ వేడుక జరిగినా, సినిమా ఫంక్షన్ జరిగినా తప్పకుండా అటెండ్ అవుతారు.

ప్రభాస్-గోపీచంద్

ప్రభాస్-గోపీచంద్

ప్రభాస్, గోపీచంద్ చిన్నతనం నుండి మంచి స్నేహితులు. ఆయా సినీ ఫంక్షన్లలో కూడా ఇద్దరూ కలిసిన సందర్భాలు అనేకం.

తాప్సీ, మంచు లక్ష్మి

తాప్సీ, మంచు లక్ష్మి

మంచు లక్ష్మి, తాప్సీ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది.

త్రివిక్రమ్-సునీల్

త్రివిక్రమ్-సునీల్

త్రివిక్రమ్, సునీల్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకప్పుడు ఇద్దరూ ఒకే రూములో ఉండి అవకాశాల కోసం ప్రయత్నించేవారు. తర్వాత త్రివిక్రమ తన సినిమాల్లో సునీల్ కోసం మంచి మంచి పాత్రలు రాశారు.

నాని, అల్లరి నరేష్

నాని, అల్లరి నరేష్

ఇండస్ట్రీలో నాని, అల్లరి నరేష్ మంచి స్నేహితులు. వీరికి ఒకరికి సంబంధించి ఏ సినిమా ఫంక్షన్ అయినా, ఫ్యామిలీ ఫంక్షన్ అయినా మరొకరు తప్పకుండా హాజరవుతారు.

చెర్రీ, బన్నీ

చెర్రీ, బన్నీ

రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య బంధుత్వం మాత్రమే కాదు.... అంతకు మించిన స్నేహ బంధం కూడా ఉంది. వీరి మధ్య ఎంతటి క్లోజ్ రిలేషన్ షిప్ ఉందో చెప్పడానికి ఈ ఫోటో ఒక్కటి చాలు.

రవితేజ-పూరి

రవితేజ-పూరి

రవితేజ-పూరి ఇద్దరూ ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్. వీరికి స్టార్ ఇమేజ్ రాక ముందు నుండే ఇద్దరి మధ్య స్నేహం ఉంది. ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో హిట్ సినిమాలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

రెజీనా, రకుల్

రెజీనా, రకుల్

హీరోయిన్ల విషయానికొస్తే... రకుల్, రెజీనా మధ్య మంచి స్నేహం ఉంది.

త్రిష-హన్సిక

త్రిష-హన్సిక

హీరోయిన్ త్రిష, హన్సిక మధ్య మంచి స్నేహ బంధం ఉంది. ఇద్దరూ తరచూ పార్టీల్లో కలిసి ఎంజాయ్ చూస్తూ చాలా సందర్భాల్లో మీడియా కంటపడ్డారు.

కాజల్, తమన్నా, సమంత

కాజల్, తమన్నా, సమంత

టాలీవుడ్లో కాజల్, తమన్నా, సమంత మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి గతంలో ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న దృశ్యం.

సందీప్ కిషన్ అండ్ గ్యాంగ్

సందీప్ కిషన్ అండ్ గ్యాంగ్

సందీప్ కిషన్, రవితేజ, వరుణ్ తేజ్, శిరీష్, సాయి ధరమ్ తేజ్ అంతా కలిసి ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న దృశ్యం.

బ్రహ్మాజీ

బ్రహ్మాజీ

బ్రహ్మాజీ ఇంట్లో జరిగిన పార్టీలో స్టార్ అంతా కలిసి ఎంజాయ్ చేస్తున్న దృశ్యం.

నవదీప్

నవదీప్

బ్రహ్మాజీ ఇంట్లో జరిగిన పార్టీలో స్టార్ అంతా కలిసి ఎంజాయ్ చేస్తున్న దృశ్యం.

బాహుబలి పార్టీలో

బాహుబలి పార్టీలో

బాహుబలి పార్టీలో అంతా కలసి ఎంజాయ్ చేస్తున్న దృశ్యం.

చిలిపి చేష్టలు

చిలిపి చేష్టలు

ఫ్రెండ్సిఫ్‌లో అప్పుడప్పుడూ ఇలాంటి చిలిపి చేష్టలు సర్వసాధారనం.

English summary
Best Friends & Famous Party Gangs Of Tollywood. In a flash, we have found that we have some of the inseparable and longtime friends in Tollywood. Check out the best buds of t-towns here in the pictures below.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu