తెలుగు సినీ పరిశ్రమలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరు?
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత పోటీ వాతావరణం ఉంటుంతో కొత్తగా చెప్పక్కర్లేదు. మొన్నటి తరం, నిన్నటి తరం, నేటి తరం హీరోలు ఎవరి స్థాయికి తగిన విధంగా వారు ఇరత హీరోలతో పోటీ పడుతుంటారు. అయితే ఎంత పోటీ వాతావరణం ఉన్నప్పటికీ పరిశ్రమలోని కొందరు స్టార్స్ మధ్య మంచి స్నేహ బంధం ఉండటం విశేషం.
సీనియర్ హీరోల విషయానికొస్తే....చిరంజీవి, నాగార్జున మధ్య సినిమాల పరంగంగా పోటీ వాతావరణం ఉన్నప్పటికీ ఇద్దరూ రియల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్. అనేక సందర్భాల్లో వీరి కలిసి ఒకే ఫంక్షన్‌కు హాజరవ్వడం, కలివిడిగా ఉండటమే ఇందుకు నిదర్శనం. నాగార్జున నిర్వహించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' రియాల్టీ షో మొదటి సీజన్ చివరి ఎపిసోడ్ చిరంజీవితో ముగించారు.
ఇక రామ్ చరణ్, అల్లు అర్జున్....మధ్య ఎంత బంధుత్వం ఉందో, అదే రేంజిలో ఫోటీ వాతావరణం కూడా ఉంది. బంధుత్వం, సినిమాల పోటీ సంగతి పక్కన పెడితే ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అదే విధంగా పవన్ కళ్యాణ్-మహేష్ బాబు మధ్య కూడా మంచి స్నేహబంధం ఉంది. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

చిరంజీవి-నాగార్జున
ఏదైనా ఫంక్షన్లో చిరంజీవి, నాగార్జున కలిస్తే....ఇలా సరదాగా మాట్లాడుకుంటారు.

పవన్ కళ్యాణ్-మహేష్ బాబు
పవన్ కళ్యాణ్-మహేష్ బాబు మధ్య మంచి స్నేహ బంధం ఉంది. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో వీరు కలుస్తుంటారు. పవన్ కళ్యాణ్ సినిమా కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు.

రామ్ చరణ్-అల్లు అర్జున్
రామ్ చరణ్, అల్లు అర్జున్ కేవలం బంధుత్వం మాత్రమే కాదు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఈ ఇద్దరు కలిసి ఎవడు చిత్రంలో కలిసి నటించారు.

ప్రభాస్-అల్లు అర్జున్
ప్రభాస్-అల్లు అర్జున్ మధ్య కూడా మంచి స్నేహ బంధం ఉంది.

రానా దగ్గుబాటి, అల్లు అర్జున్, రామ్ చరణ్
రానా దగ్గుబాటి, అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. ఈ ముగ్గురు చిన్నతనం నుండి కలిసి పెరిగారు.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్
పవన్ కళ్యాణ్ సాధారణంగా ఎక్కువగా ఎవరితో పెద్దగా కలవరు. ఆయన ఎవరతోనైనా కనెక్ట్ అయ్యారంట ఆయన కోసం ఏమైనా చేస్తారు. అలాంటి మిత్రుల్లో త్రివిక్రమ్ ఒకరు. ఇటీవల త్రివిక్రమ్‌కు స్కోడా కారు బహుమతిగా ఇచ్చాడు పవన్ కళ్యాణ్.

జూ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల, వి వినాయక్
జూ ఎన్టీఆర్ చాలా జోవియల్ పర్సన్. ఆయన ఎవరితోనైనా చాలా ఈజీగా మింగిల్ అవుతారు. రాజీవ్ కనకాల, వివి వినాయక్ ఆయన బెస్ట్ ఫ్రెండ్స్.

తమన్నా-శృతి హాసన్
సాధారణంగా ఒకే ఇండస్ట్రీలో పని చేసే హీరోయిన్ల మధ్య సరైన సంబంధాలు ఉండవు. కానీ కొందరు మాత్రం పోటీ తత్వాన్ని మరిచి పోయి స్నేహితుల్లా మెలుగుతారు. అలాంటి వారిలో శృతి హాసన్, తమన్నా ఒకరు.

త్రిష-నయనతార
త్రిష-నయనతార మధ్య ఫ్రెండ్షిప్ ఏ రేంజిలో ఉందో చెప్పడానికి ఈ ఫోటోయే నిదర్శనం. ఇద్దరూ కలిసి పార్టీ చేసుకున్న సందర్భంలోనిది ఈ ఫోటో.

మంచు విష్ణు, హన్సిక
మంచు విష్ణు, హన్సిక మధ్య కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది.


Click it and Unblock the Notifications











