»   » ఈ హీరోలు, హీరోయిన్లు బెస్ట్ ఫ్రెండ్స్ అనడానికి ఈ ఫోటోలో సాక్ష్యం...

ఈ హీరోలు, హీరోయిన్లు బెస్ట్ ఫ్రెండ్స్ అనడానికి ఈ ఫోటోలో సాక్ష్యం...

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    నేడు... అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం అనే సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుక జరుపుకుంటారు. మంచి మనుషులు, మంచి మనసులు ఉన్న ప్రతి చోటా స్నేహం చిగురిస్తుంది. అసలు స్నేహం అంటే ఏమిటి...? మనతో ఎలాంటి సంబంధం లేని ఒక వ్యక్తి మన ఆనందంలో, కష్టంలో పాలు పంచుకుంటూ నీకు తోడుగా నిలవడమే.

    మనం చిన్నతనంలో, స్కూల్ డేస్‌లో, కాలేజ్ డేస్‌లో, వర్క్ ప్లేసులో... ఇలా ప్రతి చోటా మనం స్నేహితులను వెతుక్కుంటాం. మంచి స్నేహితులు లభిస్తే లైఫ్ మరింత ఆనందంగా సాగుతుంది. సినిమా రంగానికి చెందిన స్టార్స్ కూడా అంతే. ఎక్కడెక్కడి నుండో వచ్చి సినిమా రంగంలో కలిసి పని చేస్తూ మంచి స్నేహితులగా మారిన వారు ఉందోరో...

    సుమంత్, మహేష్ బాబు

    సుమంత్, మహేష్ బాబు

    సుమంత్, మహేష్ బాబు చిన్నతనం నుండి మంచి ఫ్రెండ్స్. ఇప్పుడంటే ఎవరి ప్రొఫెషన్లో వారు బిజీ అయిపోయి, తక్కువగా కలుసుకుంటున్నారు కానీ .... ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది.

    పవన్-అలీ

    పవన్-అలీ

    టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ కు మంచి స్నేహితుడు అలీ. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో అలీకి తప్పకుండా ఓ క్యారెక్టర్ ఉంటుంది. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందనడానికి ఇంతకుమించిన ఉదాహరణ అవసరం లేదు.

    నాగార్జున, చిరంజీవి

    నాగార్జున, చిరంజీవి

    టాలీవుడ్లో చిరంజీవి, నాగార్జున మధ్య మంచి స్నేహ బంధం ఉంది. ఇద్దరూ కలిసి గతంలో మాటీవీని స్థాపించారు. కష్టాలు, సుఖాల్లోనూ ఇద్దరూ పాలుపంచుకుంటారు.

    రానా, చరణ్

    రానా, చరణ్

    రామ్ చరణ్, రానా స్కూలు డేస్ నుండే మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందో చెప్పడానికి ఈ ఫోటో చక్కటి ఉదాహరణ.

    రాజమౌళి-ఎన్టీఆర్

    రాజమౌళి-ఎన్టీఆర్

    దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ ఇద్దరూ కెరీర్ దాదాపు ఒకేసారి మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య స్నేహం బాగా పెరిగింది. ఇరుకుటుంబాల్లో ఏ వేడుక జరిగినా, సినిమా ఫంక్షన్ జరిగినా తప్పకుండా అటెండ్ అవుతారు.

    ప్రభాస్-గోపీచంద్

    ప్రభాస్-గోపీచంద్

    ప్రభాస్, గోపీచంద్ చిన్నతనం నుండి మంచి స్నేహితులు. ఆయా సినీ ఫంక్షన్లలో కూడా ఇద్దరూ కలిసిన సందర్భాలు అనేకం.

    తాప్సీ, మంచు లక్ష్మి

    తాప్సీ, మంచు లక్ష్మి

    మంచు లక్ష్మి, తాప్సీ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది.

    త్రివిక్రమ్-సునీల్

    త్రివిక్రమ్-సునీల్

    త్రివిక్రమ్, సునీల్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకప్పుడు ఇద్దరూ ఒకే రూములో ఉండి అవకాశాల కోసం ప్రయత్నించేవారు. తర్వాత త్రివిక్రమ తన సినిమాల్లో సునీల్ కోసం మంచి మంచి పాత్రలు రాశారు.

    నాని, అల్లరి నరేష్

    నాని, అల్లరి నరేష్

    ఇండస్ట్రీలో నాని, అల్లరి నరేష్ మంచి స్నేహితులు. వీరికి ఒకరికి సంబంధించి ఏ సినిమా ఫంక్షన్ అయినా, ఫ్యామిలీ ఫంక్షన్ అయినా మరొకరు తప్పకుండా హాజరవుతారు.

    చెర్రీ, బన్నీ

    చెర్రీ, బన్నీ

    రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య బంధుత్వం మాత్రమే కాదు.... అంతకు మించిన స్నేహ బంధం కూడా ఉంది. వీరి మధ్య ఎంతటి క్లోజ్ రిలేషన్ షిప్ ఉందో చెప్పడానికి ఈ ఫోటో ఒక్కటి చాలు.

    రవితేజ-పూరి

    రవితేజ-పూరి

    రవితేజ-పూరి ఇద్దరూ ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్. వీరికి స్టార్ ఇమేజ్ రాక ముందు నుండే ఇద్దరి మధ్య స్నేహం ఉంది. ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో హిట్ సినిమాలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

    కాజల్, తమన్నా, సమంత

    కాజల్, తమన్నా, సమంత

    టాలీవుడ్లో కాజల్, తమన్నా, సమంత మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి గతంలో ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న దృశ్యం.

    సందీప్ కిషన్ అండ్ గ్యాంగ్

    సందీప్ కిషన్ అండ్ గ్యాంగ్

    సందీప్ కిషన్, రవితేజ, వరుణ్ తేజ్, శిరీష్, సాయి ధరమ్ తేజ్ అంతా కలిసి ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న దృశ్యం.

    English summary
    Best Friends & Famous Party Gangs Of Tollywood. In a flash, we have found that we have some of the inseparable and longtime friends in Tollywood. Check out the best buds of t-towns here in the pictures below.
    దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more