రేపు వివాహం: హీరోయిన్ ఇంట్లో పెళ్లి సందడి (ఫోటోస్)
హైదరాబాద్: మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్....గురించి మీకు పరిచయం ఉండే ఉంటుంది. అమ్మడు తెలుగులో ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించక పోయినా, ఎన్టీఆర్ 'రభస'లో నటించబోతోందంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. అంతేకాక తమిళంలో ధనుష్‌తో నటించిన ఓ సినిమాలో బొడ్డు సీన్ విషయంలో రచ్చరచ్చ చేసి వివాదాస్పద హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ విషయంలో హీరోయిన్ నయనతార, నజ్రియా మధ్య మాటల యుద్దం జరిగింది.
ఆ సంగతి పక్కన పెడితే నజ్రియా ఎంగేజ్మెంట్ మళయాల నటుడు ఫహాద్ ఫాజిల్‌తో ఫిబ్రవరిలో 9న తిరువనంతపురంలో జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత వీరి 'బెంగుళూరు డేస్' అనే మళయాల చిత్రంలో కలిసి నటించాడు. వీరి వివాహం రేపు (ఆగస్టు 21) త్రివేంద్రంలో జరుగబోతోంది. ఆగస్టు 24వ తేదీన రిసెప్షన్ జరుగనుంది.
ఇప్పటికే ఇటు నజ్రియా నజీమ్ కుటుంబంలో...అటు ఫహాద్ ఫాజిల్ కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. నిన్న నజ్రియా ఇంట్లో మెహంది, హల్ది వేడుక జరిగింది. ఈ వేడుకకు నజ్రియా క్లోజ్ ఫ్రెండ్, నటి అయిన మీరా నందన్ హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఆమె షేర్ చేసారు. స్లైడ్ షోలో ఫోటోలు...

హల్ది మరియు మెహందీ సెర్మనీ
నజ్రియా ఫ్యామిలీ నిన్న హల్ది మరియు మెహందీ వేడుక జరుపుకున్నారు.

మ్యారేజ్
వివాహ వేడుక రేపు(ఆగస్టు 21) త్రివేండ్రంలో జరుగనుంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరవుతారు. అభిమానులకు, మీడియాకు అనుమతి లేదు.

లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్
వీరిది పెద్దలు కుదర్చిన వివాహం. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఎంగేజ్మెంట్ తర్వాత ఇద్దరూ కలిసి సినిమాలో నటించారు.

అసక్తి...
వరుడు ఫహాద్ ఫాజిల్ మలయాళంలో పేరున్న నటుడు. నజ్రియా మలయాళం, తమిళంలో ఒక స్థాయిలో ఉన్న తార. దీంతో వీరి వివాహంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రిసెప్షన్
ఆగస్టు 24వ తేదీన రిసెప్షన్ అలపుజలో జరుగనుంది. దీనికి సినీ పరివ్రమలోని ప్రముఖులు హాజరు కానున్నారు.

పహాద్ బిజీ షెడ్యూల్
పహాద్ వివిధ షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నారు. పెళ్లయిన వెంటనే అతను మణిరత్నం సినిమాలో నటించబోతున్నాడు. హనీమూన్ ప్లాన్ ఇంకా రెడీ కాలేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











