Best Of Tollywood 2024: ఈ ఏడాది మీ ఫేవరెట్ సినిమా, హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఎవరు?
2024కు వీడ్కోలు పలికే సమయం దగ్గరపడింది. మరికొద్దిరోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. ఈ ఏడాది ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, సంతోషం, ఆనందం, విజయాలు, పరాజయాలు ఇలా ఎన్నో తీపి జ్ఞాపకాలు. వాటిని గుండెల్లో దాచుకుంటూ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనుంది ప్రపంచం. ఇకపోతే ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు మరుపురాని సంవత్సరంగా నిలవనుంది.
కల్కి 2898 ఏడీ, పుష్ప 2 చిత్రాలు పాన్ ఇండియా లెవల్‌లో టాలీవుడ్ స్టామినా ఏంటో నిరూపించాయి. వీటితో పాటు మరెన్నో చిత్రాలు, నటీనటులు, టెక్నీషియన్లు తమ సత్తా చాటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తెలుగు సినిమాకు సంబంధించిన ఫిల్మీబీట్ ఓ పోల్ నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం మీకు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్ తదితర విభాగాల్లో మీకు ఎవరు నచ్చారో తెలియజేయండి.

ఉత్తమ నటుడు :
ఈ ఏడాది ఉత్తమ నటుడు విభాగంలో దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్) , జూ ఎన్టీఆర్ (దేవర పార్ట్ 1) , అల్లు అర్జున్ (పుష్ప 2) , తేజా సజ్జా (హనుమాన్) , నాగార్జున (నా సామి రంగా) , మహేశ్ బాబు (గుంటూరు కారం) , ప్రభాస్ (కల్కి 2898 ఏడీ) , కిరణ్ అబ్బవరం ( క ) , శ్రీ విష్ణు ( ఓం భీం బుష్ , స్వాగ్ ), నాని (సరిపోదా శనివారం) , రవితేజ (ఈగల్, మిస్టర్ బచ్చన్ ) , సిద్ధూ జొన్నలగడ్డ (టిల్లూ స్క్వేర్ ) , సుహాస్ (అంబాజీ పేట మ్యారేజ్ బాండ్) , విశ్వక్ సేన్‌లు (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామి) పోటీపడుతున్నారు. మరి వీరిలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న నటుడు ఎవరో? వారికి ఓటు వేయండి.
ఉత్తమ నటి :
ఈ ఏడాది ఉత్తమ నటి విభాగంలో మృణాల్ ఠాకూర్ (ది ఫ్యామిలీ స్టార్ ) , జాన్వీ కపూర్ (దేవర) , శ్రీలీల ( గుంటూరు కారం) , దిశా పటానీ ( కల్కి 2898 ఏడీ) , అమృత అయ్యర్ ( హనుమాన్), మీనాక్షి చౌదరి ( లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ) , అనుపమ పరమేశ్వరన్ ( టిల్లూ స్క్వేర్, ఈగల్), ప్రియాంక మోహన్ (సరిపోదా శనివారం), నయన్ సారిక (క, ఆయ్), ఆషిక రంగనాథ్ ( నా సామి రంగా), కావ్య థాపర్ ( డబుల్ ఇస్మార్ట్, ఈగల్), శ్రద్ధా శ్రీనాథ్ ( మెకానిక్ రాకీ, సైంధవ్) మరి వీరిలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న నటి ఎవరో? వారికి ఓటు వేయండి.
విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం :
ఈ ఏడాది కొన్ని చిత్రాలు సరికొత్త కథ, కథనంతో వచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. అవి ఊరు పేరు బైరవకోన, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఆరంభం, గామి, లంబసింగి, మ్యూజిక్ షాప్ మూర్తి, కమిటీ కుర్రోళ్లు, 35, మత్తు వదలరా 2, పోటేల్, జీబ్రా. మరి వీటిలో మీకు నచ్చిన సినిమా ఏదో చూసి ఓటు వేయండి.
ఉత్తమ తొలి చిత్ర నటి :
ఎప్పటిలాగానే ఈ ఏడాది తెలుగు తెరపై కొత్త అందాలు పలకరించాయి. ఎంతో మంది కొత్త అమ్మాయిలు తమ అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. వారిలో సంయుక్త విశ్వనాథన్ (చారి 111) , మనుషి చిల్లర్ (ఆపరేషన్ వాలెంటైన్) , జాన్వీ కపూర్ (దేవర), భూమి శెట్టి (షరతులు వర్తిస్తాయి) , యాషా శివకుమార్ (వేయ్ దరువేయ్), ప్రీతి ముకుందన్ ( ఓం భీమ్ బుష్) , రుక్మిణీ వసంత్ ( అప్పుడో ఇప్పుడో ఎప్పుడో) , అతిరా రాజ్ (కృష్ణమ్మ) , సిరి లెళ్ల (ప్రతినిధి 2), పంఖురి గిడ్వాని ( లవ్ మౌలి), భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్), నయన్ సారిక (క, ఆయ్) మరి వీరిలో మీకు నచ్చిన కొత్త నటి ఎవరో ఆమెకు ఓటు వేయండి.
ఉత్తమ దర్శకుడు :
ఈ ఏడాది బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో వివేక్ ఆత్రేయ (సరిపోదా శనివారం), నాగ్ అశ్విన్ ( కల్కి 2898 ఏడీ), కొరటాల శివ (దేవర), ప్రశాంత్ వర్మ (హనుమాన్), త్రివిక్రమ్ శ్రీనివాస్ (గుంటూరు కారం), మల్లిక్ రామ్ (టిల్లూ స్క్వేర్), వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్ ), సందీప్ (క), విజయ్ బిన్నీ (నా సామి రంగా), సుకుమార్ (పుష్ప 2), వి ఆనంద్ (ఊరు పేరు బైరవ కోన), హసిత్ గోలి (స్వాగ్), శ్రీహర్ష కొంగంటి ( ఓం భీమ్ బుష్), అజయ్ నాగ (ఆరంభం)లు పోటీ పడుతున్నారు. మరి వీరిలో మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరో వారికి ఓటు వేయండి.
ఫేవరేట్ యాక్టర్ :
ప్రతి ఒక్కరికీ ఫేవరేట్ యాక్టర్ అనే వాళ్లు ఒకరు ఉంటారు. ఎవరైనా ఎప్పుడైనా ఈ క్వశ్చన్ అడగ్గానే వెంటనే ఆన్సర్ ఇస్తారు. ఇక్కడ ప్రస్తావించిన వారిలో మీ ఫేవరేట్ యాక్టర్ ఎవరో వారికి ఓటు వేయండి. ఈ విభాగంలో అల్లు అర్జున్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, జూ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండ, రవితేజ, రామ్ పోతినేనిలు పోటీ పడుతున్నారు.
ఉత్తమ సంగీత దర్శకుడు :
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ది బెస్ట్ మ్యూజిక్‌తో ప్రేక్షకులను అలరించారు సంగీత దర్శకులు . ఈ విభాగంలో సంతోష్ నారాయణన్ (కల్కి 2898 ఏడీ), అనిరుధ్ రవిచంద్రన్ (దేవర), హరి గౌర (హనుమాన్), తమన్ యస్ (గుంటూరు కారం), భీమ్స్ సిసిరోలియో (టిల్లు స్క్వేర్ ), జీవీ ప్రకాష్ కుమార్ ( లక్కీ భాస్కర్, మట్కా), జాక్సో బిజోయ్ (సరిపోదా శనివారం, మెకానిక్ రాకీ ), శ్యామ్ సీఎస్ (క), డవ్ జంద్ (ఈగల్), శేఖర్ చంద్ర (ఊరు పేరు భైరవ కోన), సన్ని ఎమ్ ఆర్ (ఓం భీమ్ బుష్, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో), వివేక్ సాగర్ (స్వాగ్, 35), చేతన్ భరద్వాజ్ (హరోం హర), మణిశర్మ (డబుల్ ఇస్మార్ట్), దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2) . మరి ఈ సంవత్సరం మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో వారికి ఓటు వేయండి.
ఉత్తమ సహాయ నటుడు :
ప్రతి సినిమా విజయంలోనూ సహాయ నటుడిది కీలకపాత్ర.. ఈ ఏడాది కూడా కొందరు సహాయ నటులు తమ నటనతో అలరించారు. వారు ఎవరో చూస్తే .. అమితాబ్ బచ్చన్ ( కల్కి 2898 ఏడీ), శ్రీకాంత్ (దేవర పార్ట్ 1), వెన్నెల కిషోర్ (హనుమాన్ ), మురళీధర్ గౌడ్ (టిల్లూ స్క్వేర్ ), రామ్‌కీ (లక్కీ భాస్కర్), సర్వదామన్ డీ బెనర్జీ (లక్కీ భాస్కర్ ), సాయి కుమార్ (సరిపోదా శనివారం), అల్లరి నరేష్ ( నా సామి రంగా) భూషణ్ (ఆరంభం) , సయాజీ షిండే (మా నాన్న సూపర్ హీరో) . మరి వీరిలో ఎవరి నటన నచ్చిందో వారికి ఓటు వేయండి.
ఉత్తమ సహాయ నటి :
ఈ ఏడాది కూడా కొందరు సహాయ నటీమణలు హీరో, హీరోయిన్లనే డామినేట్ చేసి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిలో దీపిక పదుకొనె (కల్కి 2898 ఏడీ), శరలక్ష్మీ శరత్ కుమార్ (హనుమాన్), అభిరామి (సరిపోదా శనివారం), తన్వి రామ్ (క), మీరా జాస్మిన్ (స్వాగ్). మరి వీరిలో ఎవరి నటన నచ్చిందో వారికి ఓటు వేయండి.
ఉత్తమ ప్రతినాయకుడు :
సినిమా విజయంలో హీరోది ఎంత కీలకపాత్రో విలన్‌ది కూడా అంతే. ఈ ఏడాది కూడా పలువురు నటులు తమ విలనిజంతో క్రూరంగా కనిపించారు. వీరిలో కమల్ హాసన్ (కల్కి 2898 ఏడీ), సైఫ్ అలీ ఖాన్ (దేవర), మురళీ శర్మ (సరిపోదా శనివారం), ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం), షబీర్ కల్లరక్కల్ (నా సామి రంగా), వినయ్ రాయ్ (హనుమాన్, ఈగల్), నవాజుద్దీన్ సిద్ధిఖి ( సైంధవ్), సుదేవ్ నాయర్ (దేవర, సైంధవ్), రవిశంకర్ పీ (భజే వాయువేగం), సంజయ్ దత్ (డబుల్ ఇస్మార్ట్), ఫహద్ ఫాసిల్ (పుష్ప 2). మరి వీరిలో విలన్‌గా మిమ్మల్ని ఎవరు ఆకట్టుకున్నారు? ఎవరి నటన నచ్చిందో వారికి ఓటు వేయండి.
బెస్ట్ వెబ్ సిరీస్:
సినిమాలతో సమానంగా ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్‌లు కూడా ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీల రాకతో వెబ్ సిరీస్‌లు దూసుకెళ్తున్నాయి. ఈ ఏడాది కూడా వందలాది వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అయ్యాయి. వీటిలో వికటకవి, బెంచ్ లైఫ్, బహిష్కరణ, 90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ , పరువు, ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్, యక్షిణి, మిస్ పర్ఫెక్ట్, బృంద ఉన్నాయి. మరి వీటిలో మీకు ఏ వెబ్ సిరీస్ నచ్చిందో దానికి ఓటు వేయండి.
ఉత్తమ చిత్రం :
2024లో టాలీవుడ్ నుంచి వందలాది చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. కల్కి 2898 ఏడీ, దేవర, హనుమాన్, గుంటూరు కారం, టిల్లూ స్క్వేర్, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్, క, నా సామి రంగా, ఓం భీమ్ బుష్, హరోం హర, పుష్ప 2, మెకానిక్ రాకీ . మరి వీటిలో మిమ్మల్ని బాగా అలరించిన చిత్రం ఏదో దానికి ఓటు వేయండి.
ఉత్తమ నేపథ్య గాయకుడు :
ఈ ఏడాది కూడా ఎన్నో పాటలు ప్రేక్షకులను అలరించాయి. అలాగే ఆ పాటలు ఆలపించిన వారు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకృష్ణ ( గుంటూరు కారం), అరిజిత్ సింగ్ ( ఓం బీమ్ బుష్), అనిరుద్ రవిచంద్రన్ (దేవర), నకాష్ అజిజ్ (దేవర) , అనురాగ్ కులకర్ణి (డబుల్ ఇస్మార్ట్) , విశాల్ మిశ్రా (లక్కీ భాస్కర్), సిద్ శ్రీరామ్ (ఫ్యామిలీ స్టార్, ఊరు పేరు భైరవ కోన), సంజిత్ హెగ్డే (కల్కి 2898 ఏడీ), శేఖర్ చంద్ర . మరి వీరిలో మీకు బాగా నచ్చిన నేపథ్య గాయకుడు ఎవరో వారికి ఓటు వేయండి.
ఉత్తమ నేపథ్య గాయనీ :
ఈ ఏడాది కూడా ఎన్నో పాటలు ప్రేక్షకులను అలరించాయి. అలాగే ఆ పాటలు ఆలపించిన నేపథ్య గాయనీలు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సాహితి చాగంటి (గుంటూరు కారం), శిల్పా రావు (దేవర), శ్రేయ ఘోషల్ (పుష్ప 2), సుబ్లహ్షిణి (పుష్ప 2), అనురాగ్ కులకర్ణి (మిస్టర్ బచ్చన్ ), శ్వేతా మోహన్ (లక్కీ భాస్కర్ ) వీరిలో ఎవరి గాత్రం మీకు బాగా నచ్చిందా వారికి ఓటు వేయండి.


Click it and Unblock the Notifications










