గడ్డం తీసిన రాజమౌళి, బాలయ్యతో... లెజెండ్ షో
హైదరాబాద్: 'బాహుబలి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు రాజమౌళి భారీ గడ్డంతో కనిపించిన సంగతి తెలిసిందే. రాజమౌళి హాలీవుడ్ దర్శకులను ఫాలో అవుతున్నాడని, వారి మాదిరిగానే ఇలా సినిమా పూర్తయ్యే వరకు గడ్డం తీయకూడదని డిసైడయ్యాడని, తాను సినిమా కోసం పడుతున్న కష్టాన్ని ఇలా గడ్డం రూపంలో చూపెడుతున్నాడని ఇటీవల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
'బాహుబలి' సినిమా పూర్తయ్యే వరకు రాజమౌళి గడ్డం తీయడనే అంతా అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి గడ్డం మొత్తం తీసేని క్లీన్ షేవ్ చేసుకుని దర్శనమిచ్చాడు. శుక్రవారం ఉదయం కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో బాలయ్యతో కలిసి 'లెజెండ్' సినిమా వీక్షించాడు రాజమౌళి.
లెజెండ్ సినిమా చూడటానికి రాజమౌళితో పాటు ఆయన భార్య రమ, సంగీత దర్శకుడు కీరవాని కూడా హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో......

రాజమౌళి, రమ
నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రాన్ని చూసేందుకు భ్రమరాంబ థియేటర్‌కు చేరుకున్న రాజమౌళి, రమ.

కీరవాణి
నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రాన్ని చూసేందుకు భ్రమరాంబ థియేటర్‌కు చేరుకున్న సంగీత దర్శకుడు కీరవాణి.

రాజమౌళి
రాజమౌళి ప్రస్తుతం బాహుబలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

బాలయ్యతో కలిసి రాజమౌళి
కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లలో రాజమౌళి, బాలయ్య కలిసి ‘లెజెండ్' సినిమా చూసారు.


Click it and Unblock the Notifications











