రష్మిక మందన్న, కియారా అద్వానీ, పాయల్ రాజ్‌పుత్... వీరిలో ఉత్తమనటి ఎవరో మీరే తేల్చండి!
2018లో తెలుగు ఇండస్ట్రీకి పలువురు కొత్త హీరోయిన్లు పరిచయమయ్యారు. కాశ్మీర పర్దేషి(నర్తనశాల), కావ్య తపార్(ఈ మాయ పేరేమిటో), కియారా అద్వానీ ( భరత్ అనే నేను), నటాషా దోషి(జై సింహా), నిధి అగర్వాల్(సవ్యసాచి), పాయల్ రాజ్ పుత్(ఆర్ఎక్స్ 100), రష్మిక మందన్న(గీత గోవిందం, ఛలో), రిద్ది కుమార్ (లవర్), రియా సుమన్ (చి ల సౌ), రుహాని శర్మ (చిలసై), సిద్ధి ఇద్నాని( జంబ లకిడి పంబ), శోభిత ధూళిపాళ( గూఢచారి) తదితరులు టాలీవుడ్లో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 2018లో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. కొన్ని చిన్న చిత్రాలు భారీ విజయాన్ని అందుకొంటే.. భారీ హీరోల సినిమాలు కొన్ని హిట్టవ్వగా, మరికొన్ని బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. 2018 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రం, హీరో, హీరోయిన్, కమెడియన్ తదితర విభాగాల్లో తెలుగు ఫిల్మీబీట్ ఆన్ లైన్ సర్వే నిర్వహిస్తున్నది. మీ అభిమాన సెలబ్రిటీకి ఓటు వేసి వారిని గెలిపించండి


Click it and Unblock the Notifications











