బుల్లి ఐశ్వర్య నిక్ నేమ్ ‘బేటి బి’!
ఐశ్వర్య-అభిషేక్‌ల కూతురు పేరు ఏం పెడతారో అని దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఆ చిన్నారి పేరు K అక్షరంతో మొదలు పెడితే ఆమె భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని ఇప్పటికే న్యూమరాలజిస్టులు, జోతిష్య పండితులు సూచించారు కూడా. ఆమెకు పేరు పెట్టడానికి ఇంకా చాలా సమయం పడుతుంది కాబట్టి ఆమె నిక్ నేమ్ ఏం పెడతారో? అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బచ్చన్ అబిమానులు.
తాజాగా బుల్లి ఐశ్వర్య నిక్ నేమ్ ఏమిటో తెలిసి పోయింది. అభిషేక్ తన ట్విట్టర్లో...బుల్లి ఐశ్వర్యకు 'బేటీ బి" అనే నిక్ నేమ్ పెడుతున్నట్లు చెప్పకనే చెప్పారు. ఇప్పటికే Sr B(సీనియర్ బచ్చన్), Jr B(జూనియర్ బచ్చన్) పేర్లు ఉన్నయి కాబట్టి ఆ చిన్నారికి Beti B(బేటి బచ్చన్) అని పెడితే బాగుటుందని నటి సహనా గోస్వామి అభిషేక్ కు సూచించారు. దీనికి అభిషేష్ సానుకూలంగానే స్పందించడంతో....మీడియాలో ఇకపై ఐశ్వర్య కూతురు పేరు 'బేటి బి"గా ప్రచారం జరుగడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











