twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాదన వద్దు, నిజం తేల్చండి: మురుగదాస్ మరో సంచలన ట్వీట్!

    మురుగదాస్ ప్రియదర్శన్ కు కౌంటర్ ఇస్తూ సంచలన ట్వీట్ చేసారు. 'మిస్టర్ జ్యూరీ, ఇది కేవలం నా అభిప్రాయం కాదు. భారతీయ ప్రేక్షకులందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. వాధించటం కన్నా, నిజాన్ని బయటకు తీస్తే బెటర్ ' అం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: జాతీయ అవార్డుల విషయంలో ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ వల్ల మొదలైన వివాదం మరింత ముదురుతోంది. మురుగదాస్ కామెంట్ల మీద అవార్డుల కమిటీకి నేతృత్వం వహించిన ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఘాటుగా స్పందించారు. మురుగదాస్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

    అయితే మురుగదాస్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా మురుగదాస్ ప్రియదర్శన్ కు కౌంటర్ ఇస్తూ సంచలన ట్వీట్ చేసారు. 'మిస్టర్ జ్యూరీ, ఇది కేవలం నా అభిప్రాయం కాదు. భారతీయ ప్రేక్షకులందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. వాధించటం కన్నా, నిజాన్ని బయటకు తీస్తే బెటర్ ' అంటూ ట్వీట్ చేసారు.

    అసలు ఏం జరిగింది?

    ఇటీవల 64వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డులపై అసంతృప్తిగా ఉన్న మురుగదాస్... అవార్డుల ఎంపిక సరిగా లేదని, జ్యూరీ మెంబర్స్ పక్షపాతధోరణితో అవార్డుల ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోందని ట్విట్టర్ ద్వారా విమర్శించారు.

    ఘాటుగా స్పందించిన ప్రియదర్శన్

    ఘాటుగా స్పందించిన ప్రియదర్శన్

    అయితే ఈ అవార్డుల ఎంపిక దర్శకుడు ప్రియదర్శన్ నేతృత్వంలో జరుగడంతో.... మురుగదాస్ వ్యాఖ్యలపై ప్రియదర్శన్ ఘాటుగా స్పందించారు. 'అక్షయ్ కుమార్ తో సినిమా చేయాలనకున్న దర్శకుడికి అక్షయ్ నో చెప్పాడు ... అందుకే ఆయనకు అవార్డ్ రావడాన్ని తట్టుకోలేకపోతున్నాడు' అంటూ పరోక్షంగా మురుగదాస్ కు కౌంటర్ ఇచ్చాడు.

    ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదంటూ...

    ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదంటూ...

    మిస్టర్ జ్యూరీ, ఇది కేవలం నా ఒక్కడి అభిప్రాయం కాదు. భారతీయ ప్రేక్షకులందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. వాధించటం కన్నా, నిజాన్ని బయటకు తీస్తే బెటర్ ' అంటూ ప్రియదర్శన్ కామెంటుకు కౌంటర్ ఇచ్చాడు మురుగదాస్

    అవార్డులు ఎప్పుడూ వివాదమే

    అవార్డులు ఎప్పుడూ వివాదమే

    అవార్డుల విషయంలో ప్రతిసారి వివాదం చోటు చేసుకోవడం మామలే. అయితే ఈ సారి జ్యూరీ మెంబర్స్ వాదనకు దిగడంతో ఇది మరింత ముదిరింది. మరి ఇది ఇంతటితో ఆగుతుందా? లేక ఇంకా కొనసాగుతుందా? అనేది చూడాలి.

    English summary
    Reacting to director Priyadarshan who heads the jury of National Awards requested the Ghajini director to first see all those films that were chosen for the award and then make his comment. Ostensibly reacting to this, Murugadoss ,tweeted, “#NationalAwards #Biased Mr. jury, It's nt only my opinion it's the voice of whole Indian audience, better nt to argue & dig out the truth”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X