మియా, దీపికాలో గెలుపెవ్వరిదీ.. వారి అజ్ఞానం భయంకరం.. కత్తికి వర్మ జవాబు
Recommended Video

టాలీవుడ్‌లో అతిగా చర్చ జరుగుతున్న అంశం గాడ్, సెక్స్ అండ్ ట్రూత్. యూట్యూబ్ మీడియా కోసం ఓ షార్ట్ ఫిలింగా దీనిని దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించారు. ఈ పోర్న్ షార్ట్ ఫిలింలో అమెరికన్ పోర్న్‌స్టార్ మియా మల్కోవా నటించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను జనవరి 26వ తేదీన డిజిటల్ మీడియాలో విడుదల చేయబోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో ఆర్జీవికి సినీ విమర్శకుడు కత్తి మహేష్ మద్దతుగా నిలిచారు.

వివాదంపై కత్తి మహేష్
ఆర్జీవి షార్ట్ ఫిలిం వివాదంపై కత్తి మహేష్ ట్విట్టర్లో స్పందిస్తూ..
‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' థియేటర్లలో విడుదల చేయడానికి తీసిన సినిమా కాదు. అది కేవలం వెబ్ మీడియా కోసం తీసిన డాక్యుమెంటరీ మాత్రమే. అంతమాత్రాన ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. కేవలం ఆర్జీవీ తీసినందుకే ఇంత వివాదాస్పదం చేస్తున్నారా? దేశ సమాజానికి, నాగరికతకు వర్మ వల్ల ప్రమాదం పొంచి ఉందా' అని కత్తి మహేష్ ట్వీట్ చేశాడు.

కత్తికి వర్మ జవాబు
కత్తి మహేష్ ట్వీట్‌పై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. హే కత్తి మహేష్.. ఈ నిరసనకారుల అజ్ఞానమే అత్యంత భయంకరమైనది. ఇంటర్నెట్‌లో మిలియన్ల కొద్దీ విదేశీ నటీనటులు శృంగార చిత్రాల వీడియోలు లభ్యమవుతున్నాయి. అదే కోవలో ఓ విదేశీ శృంగార తార ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' వీడియోలో నటించారు. దానిపై ఆందోళన వ్యక్తం చేయడం సమంజసమా అని వర్మ ట్వీట్ చేశాడు.

పద్మావతితో పోటీ
అంతేకాకుండా మరో ఆసక్తికరమైన ట్వీట్‌ను కూడా చేశారు. నేను తీసిన గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అనే డాక్యుమెంటరీ జనవరి 26న 9 గంటలకు రిలీజ్ అవుతున్నది. పద్మావతితో నా వీడియో పోటీ పడుతున్నది అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇద్దరిలో గెలుపెవ్వరిదీ?
గాడ్, సెక్స్ అండ్ ట్రూత్, పద్మావతి సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీ జరుగనున్నది. ఈ పోటీలో మియా మల్కొవా గెలుస్తుందా? దీపికా పదుకొనే విజయం సాధిస్తుందా? వారిలో ఉత్తమ మహిళ ఎవరో వేచి చూడాల్సిందే అని వర్మ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











