'బెజవాడ'పై అప్పుడే చేతులు ఎత్తేసిన వర్మ
''బెజవాడ అనేది ఓ ఊరి పేరు మాత్రమే. అక్కడి రాజకీయాలకూ మా సినిమా కథకూ ఏ మాత్రం సంబంధం లేదు. కానీ సన్నివేశాలన్నీ వాస్తవ ప్రపంచానికి అద్దంపడతాయంటూ బెజవాడ చిత్రం దర్శకుడు వివేక్ కృష్ణ చెప్తున్నారు.డిసెంబర్ ఒకటవ తేదీన ఈ చిత్రం విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇలా చెప్పారు.ఈ సినిమాపై విజయవాడలో జనం ఆందోళన పడుతున్న నేపధ్యంలో వీరి స్టేట్ మెంట్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి.బెజవాడ,రౌడీయిజం అని చెప్పి అందరూ మీడియాలో ఈ సినిమా గురించి వార్నింగ్ లు ఇస్తూంటే ఇలా చేతులు ఇత్తేస్తూ అబ్బే ఊరికే టైటిల్ కోసం బెజవాడ వాడాం కానీ అక్కడ పరిస్ధితులను మేము సినిమా లో చూపెట్టలేదు అంటున్నారు.
నిర్మాత వర్మ సైతం ఈ విషయంపై మాట్లాడుతూ..ఇది ఫిక్షనల్ స్టోరీ.'బెజవాడ' అనే టైటిల్ పడింది మొదలు ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఇందులో చర్చించడానికి అవకాశం ఉండదు. అంత గ్రిప్పింగ్‌గా సినిమా ఉంటుంది.అలాగే 'బెజవాడ'లో ఉండే రెండు వర్గాలకు సంబంధించిన కథా కాదు.భగవంతుడి సాక్షిగా... 'బెజవాడ' కేవలం కల్పిత కథ. ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు అన్నారు.సాధారణంగా సినిమా తీసి విడుదల అయ్యాక సినిమా ప్రారంభంలో ఇదంతా కేవలం కల్పితం..ఎవరనీ ఉద్దేశ్శించి కాదు అని వేస్తారు..ఆ తర్వాత ఏ గొడవలూ రాకుండా అలా సినిమా విడుదలకు ముందే దర్శకుడు,నిర్మాత ఇద్దరూ తమకు ఆ తర్వాత జరిగే గొడవలకు ఏ సంభంధం లేదని చేతులెత్తేస్తున్నారన్నమాట.
ఇక ఈ చిత్రంలో నాగచైతన్య, అమలాపాల్, ప్రభు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అజయ్, అంజనా సుఖాని, శుభలేఖ సుధాకర్, అభిమన్యు సింగ్, ముకుల్‌దేవ్, సత్యప్రకాష్, అశోక్‌కుమార్, శ్రావణ్, లక్ష్మీ, రాహుల్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.కె.భూపతి, ఎడిషనల్ ఫోటోగ్రఫీ: హర్ష్, రవి, సఫన్, సంగీతం: అమర్ మొహెలె, ప్రదీప్ కోనేరు, ప్రేమ, ధరమ్ సందీప్, విక్రమ్, బప్పి టూటెల్, పాటలు: రెహమాన్, సిరాశ్రీ, కలువసాయి, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: ఇజాజ్-జావేద్, కళ: కృష్ణమాయ, నృత్యాలు: ప్రేమ్‌రక్షిత్, శోభ, ప్రొడక్షన్ డిజైనర్: కిషోర్, నిర్మాతలు: రామ్‌గోపాల్‌వర్మ, కిరణ్‌కుమార్ కోనేరు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: వివేక్‌కృష్ణ


Click it and Unblock the Notifications











