‘బెజవాడ రౌడీ’లను అటాక్ చేసిన విజయవాడ జనం..!
కింగ్ నాగార్జునతో 'శివ" తీసి సంచలనం సృష్టించిన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు యువసామ్రాట్ నాగచైతన్యతో 'బెజవాడ రౌడీలు" చిత్రాన్ని తీస్తూ మరోసారి సంచలనం సృష్టిస్తున్నారు. వందిత కోనేరు సమర్ఫణలో కిరణ్ కుమార్ కోనేరు భారీ ఎత్తున నిర్మిస్తున్న 'బెజవాడ రౌఢీలు" మూడో షెడ్యూల్ జూలై 11న విజయవాడలో ప్రారంభం అయింది. బాలీవుడ్ హీరోయిన్ అమృతారావు చెల్లెలు ప్రీతిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం జూలై 31వరకు విజయవాడ పరిసరాల్లో ఈ షెడ్యూల్ జరుగుతుంది
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఆ కనకదుర్గమ్మ ప్రతిరూపాన్ని సమీపంలో ఉన్న కృష్ణవేణీ నదీతీరంలో రూపొందించి, శాంతి హోమాన్ని నిర్వహించి బెజవాడ రౌడీలు చిత్రానికి ఎటువంటి విఘ్నాలు కలుగకూడదని క్రియేటివ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రార్థించారు.
పిదప సోమవారం బెజవాడ రౌడీలు చిత్రంలో టైటిల్ రోల్ నటిస్తున్న నాగచైతన్యను బెజవాడకు రప్పించారు. చిత్రం షూటింగ్‌కు రెడీ అయిపోయారు. అంతే.. ఎట్నుంచి వచ్చారో తెలియదు కానీ జనం వచ్చిపడ్డారు. బెజవాడ రౌడీలు పేరుతో సినిమా తీస్తే ఊరుకునేది లేదని షూటింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. మరి జనం కోరుతున్నట్లుగా 'బెజవాడ రౌడీలు' టైటిల్‌ను మారుస్తారో లేదంటే 'నా ఇష్టం' అంటూ మొండిగా ముందుకెళతారో చూడాలి..


Click it and Unblock the Notifications











