రామ్ గోపాల్ వర్మ పై రిలే నిరాహార దీక్షలు...!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి వివాదాలు కొత్తకాదు. ఆయన ఎక్కడుంటే అక్కడ వివాదమే. వర్మ ఏ సినిమా తీస్తే ఆ సినిమా చుట్టూ వివాదాలు ముసురుకోవడం సర్వసాధారణమైన విషయం. వర్మ తాజా సినిమా 'బెజవాడ రౌడీలు"కూడా వివాదాల్లో చిక్కుకుంది. 'బెజవాడ రౌడీలు"అంటూ బెజవాడ వాసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేంటని విజయవాడలో పలు ప్రజా సంఘాలు గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేపడ్తున్నాయి. ఈ మేరకు విజయవాడలో జరుగుతోన్న 'బెజవాడ రౌడీలు" షూటింగ్ ని కూడా ఆందోళనకారులు అడ్డుకున్నారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, సినిమా షూటింగ్ ని నిలిపివేయాల్సిందిగా పోలీసు శాఖ వర్మకి ఆదేశఆలు కూడా జారీ చేసింది. అఫ్ కోర్స్..సినిమా షూటింగ్ ఆగిపోలేదని వర్మ ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నాడనుకోండి..అది వేరే సంగతి. తాజాగా 'బెజవాడ రౌడీ"లు టైటిల్ ని మార్చాలంటూ విజయవాడలో కొందరు రిలే నిరాహార దీక్షలకు దిగారు.
ప్రశాంతంగా వున్న విజయవాడలో అరాచకాన్ని ప్రోత్సహించే దిశగా వర్మ 'బెజవాడ రౌడీలు" సినిమా పేరుతో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ రిలే నిరాహార దీక్షలపై వర్మ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి...


Click it and Unblock the Notifications











