twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోటోలు: భాగ్ మిల్ఖా భాగ్-భార్యతో ప్రకాష్ రాజ్ ఇలా

    By Bojja Kumar
    |

    ముంబై : ఫర్హాన్ అక్తర్ హీరోగా రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో రూపొందిన 'భాగ్ మిల్ఖా భాగ్' చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పటి ఇండియన్ స్టార్ అథ్లెట్ మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈచిత్రానికి విదేశాల్లోనూ మంచి స్పందన వస్తోంది.

    సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో యూనిట్ సభ్యులు ముంబైలో విజయోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి హీరో ఫర్హాన్ అక్తర్, హీరోయిన్ సోనమ్ కపూర్, సినిమాలో ఇతర పాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్ తదితరులు హాజరై సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. ప్రకాష్ రాజ్ తన భార్య పోనీ వర్మతో పాటు ఈ కార్యక్రమానికి డిఫరెంట్ స్టైల్ కాస్టూమ్స్‌తో హాజరయ్యారు.

    సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలతో పాటు, సినిమా కథాశంలోని ముఖ్యమైన పాయింట్లు, ముంబై జహులోని జెడబ్లు మారియట్ హోటల్‌లో జరిగిన సక్సెస్ మీట్ ఫోటోలను స్లైడ్ షోలో వీక్షిద్దాం......

    స్టార్ అథ్లెట్ మిల్కా సింగ్ జీవితం ఆధారంగా...


    ‘ఫ్లయింగ్ సిక్కు'గా ప్రపంచానికి సుపరిచితుడైన ఇండియన్ స్టార్ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని ‘భాగ్ మిల్ఖా భాగ్' చిత్రం తెరకెక్కింది. ఫర్హాన్ అక్తర్ మిల్ఖా సింగ్ పాత్రను పోషించారు. ఢిల్లీ-6 దర్శకుడు రాకేష్ ఓం ప్రకాస్ మెహ్రా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు.

    దేశ విభజన సంఘటనతో సినిమాపై క్రేజ్


    దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌లో మిల్ఖా సింగ్ అనే బాలుడి కుటుంబ ఊచకోతకు గురవుతుంది. బ్రతికి బయట పడ్డ మిల్ఖా సింగ్ ఢిల్లీ చేరుకుంటాడు. దుర్భర పరిస్థితులు, నేరాలు చేస్తూ పెరిగిన ఆ బాలుడు ఆ తర్వాత సైన్యంలో చేరి జవాన్‌గా ఎలా మారాడు, దేశం గర్వించదగ్గ అథ్లెట్‌గా మారడానికి దారి తీసిన సంఘటనలను సినిమాలో చూపించారు.

    రచయిత ప్రసూన్ జోషి చక్కటి ప్రతిభ


    ఓ అథ్లెట్ జీవితంలో చోటు చేసుకున్న ఒడిదుడుకులకు తోడుగా డ్రామా, ఎమోషన్, హ్యూమర్, విషాదం అనే అంశాలతో పాటు సృజనాత్మకతను జోడించడంలో రచయిత ప్రసూన్ జోషి సక్సెస్ అయ్యారు. ఆయన అందించిన స్క్రీన్ ప్లే, మాటలు భాగ్ మిల్ఖా భాగ్ చిత్రం విజయానికి కారణం అయింది.

    పాత్ర కోసం చాలా కష్ట పడ్డ ఫర్హాన్ అక్తర్


    మిల్ఖా సింగ్ పాత్రను పోషించిన ఫర్హాన్ అక్తర్....పాత్రలో ఒదిగిపోయాడు. ఓ అథ్లెట్ పాత్రలో నటించడానికి తన దేహాన్ని పూర్తిగా మార్చుకోవడానికి ఫర్హాన్ అక్తర్ పడిన కష్టం, తాపత్రయం, కృషి అద్భుతం. ఒకరకంగా ఆ పాత్రలో ఫర్హాన్ అక్తర్ పరకాయ ప్రవేశం చేసాడని చెప్పొచ్చు.

    దర్శకుడి పని తీరు బాగుంది


    దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఫర్హాన్ అక్తర్ అందించిన అత్యుత్తమ నటనను పూర్తిగా వినియోగించుకోవడంతో పాటు....సినిమా చూస్తున్న ప్రేక్షకులు సైతం సినిమాలో లీనం అయిపోయేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.

    సోనమ్ పాత్ర చిన్నదే అయినా కీ రోల్...


    ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సోనమ్ కపూర్ కనిపించేది పావుగంటే అయినా సినిమాకు ఎంతో కీలకంగా మారింది. స్క్రీన్‌పై ఉన్నంత సేపు సోనమ్ కపూర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఒక రకంగా చెప్పాలంటే మిల్ఖాసింగ్ జీవితం మలుపు తిరగడానికి ఆమె పాత్రే కీలకం.

    ఫర్హాన్ అక్తర్ సోదరిగా దివ్యా దత్తా


    ఈచిత్రంలో మిల్ఖా సింగ్ సోదరి పాత్రను బాలీవుడ్ నటి దివ్యా దత్తా పోషించింది. సినిమాలో ఎంతో కీలకమైన పాత్ర ఇది. సినిమాలో వీరిద్దరి మధ్య కొన్ని సన్నివేశాలు భావోద్వేగాన్ని కలిగిస్తాయి.

    English summary
    The big success of Bhaag Milkha Bhaag at the box office calls for celebration! Director Rakeysh Omprakash Mehra along with Farhan Akhtar and Sonam Kapoor were at Hotel JW Marriott in Juhu, Mumbai, on Wednesday, July 17, celebrating the success of their movie. The success bash of Bhaag Milkha Bhaag was also attended by the other members of cast and crew including Divya Dutta, Pawan Malhotra, Dev Gill, Prasoon Joshi, Ganesh Acharya and Prakash Raj.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X