twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భయపడిపోతారు: అనుష్క ‘భాగమతి’ ఫస్ట్‌లుక్ ఇదే..

    అనుష్క త్వరలో ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిచిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

    By Bojja Kumar
    |

    బాహుబలి తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం భాగమతి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది. ఆయా సినిమాల్లో అనుష్క చేసిన పాత్రలకు ఏ మాత్రం తీసిపోకుండా 'భాగమతి'లో అనుష్క పాత్ర ఉండబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ యువి క్రియేషన్స్ వారు విడుదలైంది.

    పిల్ల జమీందార్ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ అందించిన అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ భాగమతి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాల భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

    భయంకరమైన లుక్‌లో అనుష్క

    భయంకరమైన లుక్‌లో అనుష్క

    భాగమతి ఫస్ట్ లుక్ పోస్టర్ భయంకరంగా ఉంది. అనుష్క ఒక చేతిలో సుత్తి, మరొక చేయి గోడకు మొల వేసి కొట్టిబడి రక్తం కారుతూ ఒళ్లు గగుర్బొడిచే విధంగా ఉంది.

    గర్వంగా ఉందన్న నిర్మాతలు

    గర్వంగా ఉందన్న నిర్మాతలు

    ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంగా చిత్ర నిర్మాతలు వంశీ, ప్రమోద్ మాట్లాడుతూ.... బాహుబలితో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న భాగమతి చిత్రాన్ని మేం నిర్మిస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నామని తెలిపారు.

    ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి

    ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి

    ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్ర కథ అద్భుతంగా కుదిరింది. చెప్పిన దానికి మించి దర్శకుడు అశోక్ అద్బుతంగా తెరకెక్కించాడు. అనుష్క పెర్ పార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. మథి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. ఆర్ట్ రవీందర్ వేసిన సెట్స్ గ్రాండియర్ గా ఉంటాయి. కథకు తగ్గట్టుగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

    బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీ సన్నివేశాన్ని హైలైట్ చేసేదిగా ఉంటుంది

    బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీ సన్నివేశాన్ని హైలైట్ చేసేదిగా ఉంటుంది

    తమన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీ సన్నివేశాన్ని హైలైట్ చేసేదిగా ఉంటుంది. భాగమతి కథ, కథనం తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుంది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు.

    అనుష్క పెర్ ఫార్మెన్స్ లో మరో కోణం

    అనుష్క పెర్ ఫార్మెన్స్ లో మరో కోణం

    దర్శకుడు అశోక్ మాట్లాడుతూ... భాగమతి చిత్రంలో అనుష్క పెర్ ఫార్మెన్స్ లో మరో కోణాన్ని ఇందులో చూడొచ్చు. ఆమె పెర్‌పార్మెన్స్ కు హాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రతీ ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేసే విధంగా ఉంటాయని తెలిపారు.

    తారాగణం, తెర వెనక

    తారాగణం, తెర వెనక

    ఈ చిత్రంలో అనుష్క, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజయ్, అజయ్ ఘోష్, మధు నందన్ నటిస్తున్నారు. సంగీతం - ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రాఫర్ - మథి, ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావ్, ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్, నిర్మాతలు - వంశీ - ప్రమోద్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - అశోక్

    English summary
    Bhagmati first look unveiled by the unit has mounted up curiosity on the film. Director Ashok who made a super hit film Pilla Zamindar is helming the project. Vamshi, Pramod who delivered several hits under their production banner UV Creations and are making Saaho with young rebel star Prabhas in four languages are bankrolling Bhagmati.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X