‘భాగమతి’ ట్రైలర్: ఒళ్లు గగుర్బొడిచేలా అనుష్క, బాహుబలిని మించిపోయింది...

By Bojja Kumar

బాహుబలి తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం భాగమతి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది. ఆయా సినిమాల్లో అనుష్క చేసిన పాత్రలకు ఏ మాత్రం తీసిపోకుండా 'భాగమతి'లో ఆమె పాత్ర ఉండబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ యువి క్రియేషన్స్ వారు విడుదల చేశారు.

 ఒళ్లు గగుర్బొడిచేలా అనుష్క పెర్ఫార్మెన్స్

ఒళ్లు గగుర్బొడిచేలా అనుష్క పెర్ఫార్మెన్స్

తాజాగా విడుదలైన ‘భాగమతి' ట్రైలర్లో అనుష్క పెర్ఫార్మెన్స్ ఒళ్లు గగుర్బొడిచే విధంగా ఉంది. ఇందులో ఆమె నటించిన తీరు, బాడీ లాంగ్వేజ్ అనుష్క గత సినిమాల కంటే భిన్నంగా అద్భుతంగా ఉంది.

 ఇది భాగమతి అడ్డా...

ఇది భాగమతి అడ్డా...

‘ఎవడు పడితే వాడు రావడానికి ఇదేమైనా పశువుల కొట్టమా? భాగమతి అడ్డా... లెక్క తేలాలి. ఒక్కడినీ పోనివ్వను' అంటూ అనుష్క చెప్పే డైలాగులు, కోపంతో ఊగిపోతూ ఆమె పెర్ఫార్మెన్స్ సూపర్బ్ అనేలా ఉన్నాయి.

 బాహుబలిని మించిపోయే పెర్ఫార్మెన్స్

బాహుబలిని మించిపోయే పెర్ఫార్మెన్స్

ఇప్పటి వరకు అనుష్క కెరీర్లో పెర్ఫార్మెన్స్ పరంగా చెప్పుకోదగ్గ చిత్రాలు అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాలు. అయితే ‘భాగమతి' ట్రైలర్ చూస్తే వాటన్నింటినీ మించి పోయేలా ఉంటుందని స్పష్టమవుతోంది.

 చంచల ఐఏఎస్... భాగమతి రెండు పాత్రల్లో అనుష్క

చంచల ఐఏఎస్... భాగమతి రెండు పాత్రల్లో అనుష్క

ఈ చిత్రంలో అనుష్క ఒక పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్ చంచలగా, మరో పాత్రలో ‘భాగమతి'గా కనిపించబోతోందని తెలుస్తోంది. అయితే భాగమతి అనేది ఆత్మ రూపంలో చంచలను ఆవహిస్తుందని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.

 భాగమతి అడ్డాకు వెళ్లడంతో అసలు కథ మొదలు

భాగమతి అడ్డాకు వెళ్లడంతో అసలు కథ మొదలు

కొందరు స్వార్థ పరులు ఐఏఎస్ ఆఫీసర్ చంచలను అక్రమ కేసులో ఇరికించి జైలు పాలు చేస్తారని, ఆ తర్వాత ఆమెను ఓ పాడుపడ్డ పాతకాలం నాటి ప్యాలెస్‌కు తరలిస్తారని, అక్కడే భాగమతి ఆత్మ చంచలను ఆవహిస్తుందని.... ఆ తర్వాత జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది.

 కొత్త కోణం ఏమైనా ఉంటుందా?

కొత్త కోణం ఏమైనా ఉంటుందా?

‘భాగమతి' ట్రైలర్ చూస్తుంటే.... గతంలో అనుష్క చేసిన ‘అరుంధతి' ఛాయలు కొన్ని కనిపిస్తున్నాయి. అలాంటి కథే అయితే అనుష్క అసలు ఒప్పుకుని ఉండేది కాదు. కథలో కొత్తదనం ఉంటుంది కాబట్టే ఆమె ఈ ప్రాజెక్టుకు కమిటైందనే వార్తలు వినిపిస్తున్నాయి.

 ఆ దర్శకుడి నుండి ఇలాంటి సినిమా, ఎక్స్ పెక్ట్ చేయలేదు

ఆ దర్శకుడి నుండి ఇలాంటి సినిమా, ఎక్స్ పెక్ట్ చేయలేదు

పిల్ల జమీందార్ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ అందించిన అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ భాగమతి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాల భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అశోక్ నుండి ఇలాంటి సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేదు.

 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీ సన్నివేశాన్ని హైలైట్ చేసేలా..

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీ సన్నివేశాన్ని హైలైట్ చేసేలా..

తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీ సన్నివేశాన్ని హైలైట్ చేసేదిగా ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత భాగమతి కథ, కథనం తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఏర్పడింది.

 అనుష్క పెర్ ఫార్మెన్స్ లో మరో కోణం

అనుష్క పెర్ ఫార్మెన్స్ లో మరో కోణం

దర్శకుడు అశోక్ మాట్లాడుతూ... భాగమతి చిత్రంలో అనుష్క పెర్ ఫార్మెన్స్ లో మరో కోణాన్ని ఇందులో చూడొచ్చు. ఆమె పెర్‌పార్మెన్స్ కు హాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రతీ ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేసే విధంగా ఉంటాయని తెలిపారు.

ముఖ్య తారాగణం

ముఖ్య తారాగణం

తారాగణం, తెర వెనక ఈ చిత్రంలో అనుష్క, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజయ్, అజయ్ ఘోష్, మధు నందన్ నటిస్తున్నారు.

తెర వనక

సంగీతం - ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రాఫర్ - మథి, ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావ్, ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్, నిర్మాతలు - వంశీ - ప్రమోద్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - అశోక్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X