'భధ్ర' హిందీ రీమేక్ పై దిల్ రాజు
రవితేజ, మీరా జాస్మిన్ కాంబినేషన్ లో రూపొందిన భద్ర చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించారు. ఇప్పుడా చిత్రం రైట్స్ ని సంజయ్ దత్ నిర్మాణ సంస్ధ తరుపున ఆయన భార్య కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని దిల్ రాజు కన్ఫర్మ్ చేస్తూ...అవును సంజయ్ దత్ భార్య మాన్యత మా దగ్గరనుంచి భద్ర చిత్రం రైట్స్ తీసుకున్నారు. ఇంకా మరికొన్ని మా బ్యానర్ లో వచ్చిన చిత్రాలను ఆమె కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలోనే ఆమె ఏమేమి కొనుగోలు చేసేరో తెలియచేస్తాం అన్నారు.
ఇక ఈ చిత్రాన్ని అజయ్ దేవగన్ తో రీమేక్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సంజయ్ దత్ ఓ ఇంటర్వూలో ఈ విషయం చెప్తూ భధ్రకు బదులు బద్రి అని పొరపాటున అన్నారు. దాంతో మీడియోలో బద్రి చిత్రం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. దాంతో బద్రి నిర్మాతలు మేం ఆల్రెడీ ఆ చిత్రాన్ని హిందీలో ఎప్పుడో రీమేక్ చేసాం. మళ్లీ ఇప్పుడు రీమేక్ చేయటం ఏమిటా అని ఆశ్చర్య పోయాం అని అన్నారు. ఇక సంజయ్ దత్ భార్య మరికొన్ని తమిళ,మళయాళ,తెలుగు చిత్రాల రీమేక్ రైట్స్ ని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు చెందిన ముగ్గురు రిప్రజెంటివ్స్ ఆ చిత్రాల రైట్స్ గురించి ఆ నిర్మాతలతో చర్చిస్తున్నారు. ఇప్పుడు హిందీలో రీమేక్ రైట్స్ మంచి వ్యాపారంగా మారిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











