అనుష్క బరువు కోసం 5 కోట్లు.. బాహుబలి దెబ్బకు భాగమతి లేవడం లేదంట..
బాహుబలితో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన తారల్లో అనుష్క ఒకరు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్, రానాకు వచ్చిన అవకాశాలు అనుష్క రాకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అందుకు ఆమె బరువే కారణం అని బలంగా వినిప
Recommended Video

బాహుబలితో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన తారల్లో అనుష్క ఒకరు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్, రానాకు వచ్చిన అవకాశాలు అనుష్క రాకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అందుకు ఆమె బరువే కారణం అని బలంగా వినిపించింది. అంతేకాకుండా ప్రభాస్‌తో అఫైర్ అనే గాసిప్ కూడా అనుష్కకు ప్రతికూలంగా మారిందనే ఊహాగానాలు వినిపించాయి.

భాగమతి చిత్రంపై బరువు దెబ్బ
అనుష్క కెరీర్‌కు ప్రతికూలంగా మారిన అంశాల్లో ఆమె బరువు ఒకటన్న విషయంపై ఎలాంటి సందేహం అక్కర్లేదు. బాహుబలి తర్వాత అనుష్క చేతిలో ఉన్న చిత్రం భాగమతి మాత్రమే. ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడో అనే విషయంపై ఉలుకు పలుకు లేదు.

బాహుబలి తర్వాత
బాహుబలి తర్వాత బాగా లావై పోయిన అనుష్క భాగమతి చిత్రంలో అలానే నటించింది. అయితే ఆమె షేప్‌ను తగ్గించడానికి గ్రాఫిక్స్‌ను ఎక్కువగా వాడుతున్నారట. గ్రాఫిక్ వర్క్ కారణంగా సినిమా లేట్ అవుతున్నదనే మాట వినిపిస్తున్నది.

భాగమతిని అందంగా..
భాగమతి రూపాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. అరుంధతి, రుద్రమదేవి చిత్రాల మాదిరిగానే భాగమతిని తీర్చి దిద్దేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

బాహుబలిలో దేవసేన
ఇక బాహుబలిలో దేవసేన పాత్ర కోసం, ఆ తర్వాత సైజ్ జీరో కోసం బాగా బరువు పెరిగింది. దాంతో మళ్లీ యధావిధిగా మారడానికి చాలా కష్టంగానే మారింది. ఈ లోగా పరిశ్రమలో నాజూకుగా ఉన్న యువ హీరోయిన్ల నుంచి పోటీ బాగానే పెరిగింది.

సాహోను చేజార్చుకొన్న..
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సాహో చిత్రంలో అందిన అవకాశాన్ని అనుష్క చేజార్చుకొన్నది. సాహోలో ప్రభాస్ సరసన తొలుత అనుష్కను బుక్ చేశారనే వార్త ఫిలిం సర్కిళ్లలో గుప్పుమన్నది. అయితే బరువు కారణంగా అనుష్కను తప్పించి ఆమె స్థానంలో శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేశారనే వార్త వెలుగులోకి వచ్చింది.

అనుష్క పూర్వ వైభవానికి
తన బరువు ఏకంగా కెరీర్‌కు ఎసరు పెడుతున్న నేపథ్యంలో అనుష్క ప్రస్తుతం తన ఫిజిక్‌ను మళ్లీ దారిలోకి తెచ్చుకొనేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారట. త్వరలోనే అనుష్కను మళ్లీ స్లిమ్‌గా చూసే అవకాశం ఉందంటున్నారు.


Click it and Unblock the Notifications











