Bhagavanth Kesari Teaser Review రాజు మందను.. మొండోడు గుండెను చూపిస్తాడు.. పవర్‌ఫుల్‌గా నేలకొండ భగవంత్ కేసరి
నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బాలకృష్ణ జన్మదినం పురస్కరించుకొని ఇటీవల భగవంత్ కేసరి టైటిల్‌ను ప్రకటించిన తర్వాత ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా జూన్ 10వ తేదీ బాలకృష్ణ జన్మదినం సందర్భంగా భగవంత్ కేసరి సినిమా టీజర్‌ను బర్త్ డే కానుకగా అభిమానులకు అందించి పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే..
భగవంత్ కేసరి టీజర్ విషయానికి వస్తే.. బాలకృష్ణ భగవంత్ కేసరిగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారనేది టీజర్ మరోసారి స్పష్టం చేసింది. ఈ చిత్రంలో వీరావేశం ఉన్న వ్యక్తిగా నటించారనే విషయం క్లారిటీ వచ్చేసింది. టీజర్‌లో తనకు తానుగా తన పేరు నేలకొండ భగవంత్ కేసరి అంటూ చెప్పుకోవడం మరింత పవర్‌ఫుల్‌గా కనిపించింది. ఈ పేరు షానా ఏళ్లు యాది ఉంటది అని తన పాత్ర స్వభావం, తీరుతెన్నుల గురించి చెప్పకనే చెప్పారు.

టీజర్‌లో.. రాజు తన వెనుక ఉన్న వందల మంది మందను చూపిస్తడు. మొండోడు వాడికి ఉన్న ఒకే ఒక గుండెను చూపిస్తడు అంటూ గుండెను బలంగా కొట్టుకొని తన పవర్ చూపించాడు. పతా హై కానోంకే బీచ్‌మే బేజా క్యోం రహతా హై, జబ్ కాన్ బైరీ పడ్తీ హై.. బాత్ బేజే పే గుస్తీ హై ( కళ్ల మధ్య మెదడు ఎందుకు ఉంటుందో తెలుసా? ఒక్కసారి గూబ గుయ్ మనిపిస్తే.. మాట నేరుగా మెదడుకు చేరుతుంది) అంటూ ఎదుటి వాడి గుబ గుయ్‌మనిపించడం టీజర్‌లో హైలెట్‌గా నిలిచింది.
అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి అంటూ దిక్కుల పిక్కటిల్లేలా అరిచారు. ఈ పేరు చాలా ఏళ్లు యాదింటుంది అంటూ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో చెప్పారు. కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. బాలీవుడ్ పాటకు గిటార్ పట్టుకొని వాయించడం సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు.
ఇక అభిమానుల ఊహలకు అందని విధంగా భగవంత్ కేసరి టీజర్ ఉంది. ఇది బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా కంటే భిన్నంగా ఉండబోతుందనే విషయాన్ని చెప్పారు పక్కా కమర్షియల్ అంశాలు, యాక్షన్ సీన్లతో కేక పెట్టించారు. బాలకృష్ణను ఇంతకు ముందు చూడని పాత్రలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా పవర్‌ఫుల్‌గా ఢీ కొట్టడానికి సిద్దమయ్యారు అనేది టీజర్‌లో విజువల్స్ చెప్పాయి.
బాలకృష్ణ అభిమానులను మెప్పించే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని అంశాలను కలబోసి భగవంత్ కేసరి చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. ఈ సినిమాకు సీ రాంప్రసాద్ కెమెరా వర్క్, తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్నది. ఈ చిత్రంలో కాజల్, శ్రీలీల కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా విజయదశమికి విడుదల కాబోతున్నది.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాము గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
సినిమాటోగ్రఫి: సీ రాంప్రసాద్
ఎడిటర్: తమ్మిరాజు
ప్రొడక్షన్ ఢిజైనర్: రాజీవన్
ఫైట్స్: వీ వెంకట్
పీఆర్వో: వంశీ శేఖర్.


Click it and Unblock the Notifications











