‘మేం వయసుకు వచ్చాం’లో ఫేమస్ స్టార్
తనీష్, మదాలస శర్మ, నీతి టేలర్ ప్రధాన తారాగణంగా రూపొదుతున్న చిత్రం 'మేం వయసుకు వచ్చాం'. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి బెక్కెం వేణుగోపాల్, లక్ష్మన్ కేదారి నిర్మాతలు. ఈ చిత్రంలో ప్రముక తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయమై దర్శక నిర్మాతలు మాట్లాడుతూ...సౌతిండియన్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకకైన భాగ్యరాజ్ కి మా కథ, అందులో ఆయన పోషించే పాత్ర నచ్చి చేయడానికి ముందుకు వచ్చారు, ఆయన పాత్ర సినిమాకు హైలెట్ గా నిలుస్తుందన్నారు.
ప్రేమలోని ఒక కొత్త కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తూ రూపొందుతున్న మేం వయసుకు వచ్చాం అన్ని వయసుల వారిని అలరిస్తుంది, అతి త్వరలో ఆడియోను విడుదల చేసి ఈ నెలాఖరున సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
ఈ చిత్రానికి మాటలు: నివాస్, పాటలు: భాస్కర భట్ల రవికుమార్, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్, కూర్పు: పూడి ప్రవీణ్, నృత్యాలు: స్వర్ణ, ఆర్ట్: వర్మ, సంగీతం: శేఖర్ చంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరిత మేడిశెట్టి, సహ నిర్మాతలు: బసిరెడ్డి, గంటా వెంకటేశ్వరరావు, నిర్మాతల: బెక్కెం వేణుగోపాల్, లక్మణ్ కేదారి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త్రినాధరావు


Click it and Unblock the Notifications












