twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ప్రేయసిపై హిట్ అండ్ రన్ కేసు!

    రోడ్డు ప్రమాదం వ్యవహారంలో అలనాటి బాలీవుడ్ తార భాగ్యశ్రీపై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది.

    By Rajababu
    |

    రోడ్డు ప్రమాదం వ్యవహారంలో అలనాటి బాలీవుడ్ తార భాగ్యశ్రీపై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ముంబైలోని శాంతక్రజ్ పోలీసులు అనేక ఒత్తిడిల నడుమ ఆమె కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడు మహ్మద్ నౌసిఫ్ షేక్ ఫిర్యాదు మేరకు భాగ్యశ్రీపై కేసు నమోదు చేశారు. బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన మైనే ప్యార్ కియా చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన భాగ్యశ్రీ నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో నటించినందుకు ఆమెకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు నీరాజనం పట్టారు.

    ముంబైలో బైక్ ఢీ కొట్టిన స్కోడా కారు

    ముంబైలో బైక్ ఢీ కొట్టిన స్కోడా కారు

    గత సెప్టెంబర్‌లో ముంబైలోని ఖర్ సబ్ వే నుంచి లింక్ రోడ్డుపై నౌసిఫ్ బైక్‌పై వెళ్తుండగా స్కోడా కారు ఢీకొట్టి వెళ్లింది. గాయపడిన నౌసీఫ్ ఆటోలో వెళ్లి ఆషా పరేఖ్ దవాఖానలో చేరాడు. ఎడమ కాలికి గాయకావడంతో అక్కడే చికిత్స చేసుకొన్నాడు.

    బాధితుడికి భాగ్యశ్రీ భర్త హిమాలయ్ పరామర్శ

    బాధితుడికి భాగ్యశ్రీ భర్త హిమాలయ్ పరామర్శ

    హాస్పిటల్‌లో ఉన్న నౌసీఫ్‌ను భాగ్యశ్రీ భర్త హిమాలయ దసానీ కలిసి పరామర్శించారు. ఆ తర్వాత దాఖలైన ఎఫ్ఐఆర్‌లో స్కోడా కారును డ్రైవ్ చేసింది భాగ్యశ్రీ అని ఆమె భర్త చెప్పాడని పేర్కొన్నాడు. అక్కడ సరైన వైద్యుడు లేకపోవడంతో నౌసీఫ్ హోలీ క్రాస్ హాస్పిటల్‌లో చేరాడు. అక్కడకు వచ్చిన హిమాలయ్ తన చికిత్సకు అయ్యే రూ.25 వేల ఖర్చును భరిస్తామని చెప్పారని, బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తామని చెప్పినట్టు నౌసీఫ్ పోలీసులకు తెలిపాడు.

    హియలయ్‌పై చీటింగ్.. పోలీసులపై ఆగ్రహం

    హియలయ్‌పై చీటింగ్.. పోలీసులపై ఆగ్రహం

    కాలికి ఆపరేషన్ జరిగిన తర్వాత డబ్బుల కోసం హిమాలయ్‌కు ఫోన్ చేయగా ఎలాంటి స్పందన లేదని నౌసీఫ్ తెలిపాడు. దాంతో చీటింగ్ చేశాడన్న భావనతో హిమాలయ్ దసానీపై నౌసీఫ్ కేసు నమోదు చేశాడు. భాగ్యశ్రీపై కేసు నమోదుకు సహకరించని శాంతాక్రజ్ పోలీసుల తీరును నౌసీఫ్ మండిపడ్డుతున్నాడు.

    బాధితుడిపై భాగ్యశ్రీ బ్లాక్ మెయిల్ కేసు

    బాధితుడిపై భాగ్యశ్రీ బ్లాక్ మెయిల్ కేసు

    నౌసీఫ్ కేసు నమోదు చేయడంపై హిమాలయ్ దసానీ స్పందించాడు. నౌసీఫ్ బ్లాక్ మెయిల చేస్తున్నాడని ఆయన ఆరోపించాడు. తమ నుండి డబ్బు గుంజడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు చేశాడు. నౌసీఫ్‌పై బ్లాక్ మెయిల్ కేసు నమోదు చేయడానికి భాగ్యశ్రీ, ఆమె భర్త ప్రయత్నించడం గమనార్హం.

    English summary
    Bhagyashree got booked based on a complaint lodged by the Santacruz resident Mohammed Nausif Shaikh. Road accident that had taken place in September last year. After Nausif Shaikh reached the hospital, Bhagyashree’s husband Himalaya Dasani and his associate Raj Kishan visited him in the hospital.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X