For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇద్దరంటనే కష్టం.. ఏకంగా ఏడుగురు హీరోయిన్లతో.. డైరెక్టర్ గురించి టాప్ హీరోయిన్స్

|
Allu Arjun Shares A Throwback Photo On Their Wedding Anniversary | Filmibeat Telugu

గతంలో ప్రేమ పావురాలు చిత్రంతో భాగ్యశ్రీ, పెళ్లి సందడితో దీప్తీ భట్నాగర్, జయంతో సదా లాంటి హీరోయిన్లు తెలుగు ప్రేక్షకులను అటు అందం, అభినయంతో రంజింపజేశారు. భాగ్యశ్రీ ఒకట్రెండు సినిమాలతో సినిమాలకు గుడ్ బై చెప్పగా, దీప్తీ భట్నాగర్ సినిమాల్లో నటిస్తూనే టెలివిజన్ రంగంలో బిజీ అయ్యారు. అలాంటి ఎంతో క్రేజ్ ఉన్న హీరోయిన్లు నేరుగా తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు.

ఆచార్య క్రియేషన్స్‌, బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌ పతాకాలపై సుందర్‌ పవన్‌ దర్శకుడిగా భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న సినిమా 'కిట్టి పార్టీ' చిత్రంలో 'మైనే ప్యార్‌ కియా' (తెలుగులో 'ప్రేమ పావురాలు') ఫేమ్‌ భాగ్య శ్రీ, 'రోజా' ఫేమ్‌ మధుబాల, 'పెళ్లి సందడి' ఫేమ్‌ దీప్తీ భట్నాగర్‌, సదా, సుమన్‌ రంగనాథ్‌, హరితేజ, హర్షవర్ధన్‌ రాణే, పూజా జవేరి నటిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా లోగో విడుదల చేశారు.

ఒక్క మహిళనే హ్యాండిల్ చేయడం కష్టం

ఒక్క మహిళనే హ్యాండిల్ చేయడం కష్టం

భాగ్య శ్రీ మాట్లాడుతూ ‘‘జీవితంలో ఒక్క మహిళను హ్యాండిల్‌ చేయడమే పురుషులకు కష్టమైన పని! నవ్వుతూ... మా దర్శకుడు సెట్‌లో మా ఏడుగురు మహిళలను హ్యాండిల్‌ చేయాలి. ఎలా చేస్తాడో! మహిళల దృక్కోణం నుంచి ఆలోచించి ఈ కథ రాసిన దర్శకుడు పవన్‌ని అభినందిస్తున్నా. మహిళల మనస్తత్వాలను అర్థం చేసుకున్నటువంటి దర్శకుడితో పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అని అన్నారు.

కిట్టి పార్టీ వినోదం కోసం కాదు..

కిట్టి పార్టీ వినోదం కోసం కాదు..

వినోదం కోసం తీస్తున్న సినిమా కాదిది. సమాజంలో అందరం కలిసి ఉన్నతస్థాయికి ఎదడగం, ఉన్నత జీవన ప్రమాణాల కోసం పని చేయడం వంటి అంశాలను చర్చిస్తూ తీస్తున్న చిత్రమిది. హాలీవుడ్‌లో వచ్చిన ‘డెస్పరేట్‌ హౌస్‌వైఫ్స్‌', ‘సెక్స్‌ అండ్‌ ది సిటీ' సినిమాల తరహాలో ఉంటుంది. సినిమాలో మేమంతా వివిధ పాత్రల్లో, వివిధ వయసుల గల మహిళలు నటిస్తున్నాం. ప్రేక్షకులకు తమ జీవితాల్లో ప్రతిరోజూ తారసపడే మహిళల్లో ఎవరో ఒకరు మా పాత్రల్లో ఏదో పాత్రలో కనిపిస్తారు. సినిమాలో మొదటి పాటను దర్శకుడు పవన్‌ నాకు వినిపించారు. చాలా బావుంది. విడుదలైన తర్వాత కొన్నేళ్ళ పాటు పార్టీల్లో ఆ పాట వినిపిస్తుంది అని భాగ్యశ్రీ అన్నారు.

 హీరో లేని సినిమాలో

హీరో లేని సినిమాలో

మధుబాల మాట్లాడుతూ హీరోపై మాత్రమే ఎక్కువ ఫోకప్‌ చేసే ఇండస్ట్రీలో... హీరో ఎవరూ లేని ఒక సినిమాకు నేనే సంతకం చేశా. ఇటువంటి సినిమా తీస్తున్నందుకు, అందులో నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు పవన్‌, నిర్మాత గుప్తాగారికి థ్యాంక్స్‌. ఇంతమంది మహిళలతో, కేవలం మహిళలు ప్రధాన పాత్రధారులుగా ఇటువంటి సినిమా తీయడానికి చాలా ధైర్యం కావాలి. వినోదం కోసం మాత్రమే ఈ సినిమా తీయడం లేదు. ఈ సినిమా కమర్షియల్‌గానూ మంచి సక్సెస్‌ సాధించాలి అని అన్నారు.

మేము 16 ఏళ్ల అమ్మాయిలం కాదు

మేము 16 ఏళ్ల అమ్మాయిలం కాదు

సుమన్‌ రంగనాధ్‌, భాగ్యశ్రీ, నేను... 16 ఏళ్ళ అమ్మాయిలం కాదు. మమ్మల్ని మెయిన్‌ లీడ్స్‌గా పెట్టి తీస్తున్నారు. మాపై నమ్మకం ఉంచినందుకు దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌. ఇంటర్వ్యూలలో మెరిల్‌ స్ట్రీప్‌ వంటి హాలీవుడ్‌ తారలు మెయిన్‌ లీడ్స్‌గా సినిమాలు చేస్తున్నారని చెబుతుంటాం. మేముందుకు అటువంటి సినిమాలు, అటువంటి అద్భుతమైన పాత్రల్లో నటించలేం? ఇప్పుడు చేస్తున్నాం. ఇందులో నేనొక మెయిన్‌ లీడ్‌గా, పూజా జవేరికి తల్లిగా నటిస్తున్నా. నా చిన్ననాటి స్నేహితురాళ్ళు సుమన్‌, భాగ్య శ్రీతో నటిస్తుండటం సంతోషంగా ఉంది'' అన్నారు.

హీరో రోల్‌లో ఎవరూ లేకుండానే

హీరో రోల్‌లో ఎవరూ లేకుండానే

సదా మాట్లాడుతూ ‘‘వేదికపై ఎక్కువమంది మహిళలున్నారు. నిజంగా వీళ్ళందరితో ఇక్కడ ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అరుదైన సంఘటన ఇది. మధుబాలగారు చెప్పినట్టు... సినిమాకు సంతకం చేశానని చెబితే ‘హీరో ఎవరు?' అని ఎక్కువశాతం మంది అడుగుతారు. బట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌... ఈసారి మా సినిమాలో హీరో ఎవరూ లేరు. ఆరుగురు మహిళలు మెయిన్‌ లీడ్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నారు. మహిళల గురించి చెప్పే సినిమా ఇది. ఇటువంటి సినిమాకు పవన్‌ కంటే మంచి దర్శకుణ్ణి ఊహించలేం. ఈ సినిమా మంచి కలెక్షన్స్‌ రాబట్టాలని కోరుకుంటున్నా అన్నారు.

ఇద్దరు హీరోయిన్లు ఉంటేనే కష్టం

ఇద్దరు హీరోయిన్లు ఉంటేనే కష్టం

గత నాలుగు రోజులుగా సినిమా కోసం మేమంతా ఫొటోషూట్స్‌ చేస్తున్నాం. దర్శక, నిర్మాతలు ఎక్కడా రాజీ పడటం లేదు. దర్శకుడు పవన్‌కి నిర్మాత గుప్తాగారు చాలా సపోర్ట్‌ చేస్తున్నారు. పవన్‌ ప్రతి విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. శంకర్‌గారి తర్వాత పవన్‌లో నేను అంత పర్‌ఫెక్షన్‌, డీటెయిలింగ్‌ చూస్తున్నా. కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ నేను ఒక సినిమాకు వర్క్‌షాప్‌ చేస్తున్నా. ఇద్దరు హీరోయిన్లు ఉంటే సెట్‌లో గొడవలు అవుతాయని అంటారు. మేం ఏడుగురున్నాం. ఏం గొడవలు లేవు. చాలా సరదాగా నవ్వుతూ వర్క్‌ చేస్తున్నాం అని సదా అన్నారు.

20 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో

20 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో

దీప్తీ భట్నాగర్‌ మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌ రావడం, అదీ 20 ఏళ్ళ తర్వాత రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిటీ నా ఫస్ట్‌ లవ్‌. నాకింకా ‘పెళ్లి సందడి' సినిమా షూటింగ్‌ చేసిన రోజులు గుర్తున్నాయి. ఈ సినిమా ఎప్పటికీ నా మనసులో ఉంటుంది. చాలా విరామం తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో నటిండచం సంతోషంగా ఉంది'' అన్నారు.

తెలుగులో రెండు, మూడు సినిమాలు మాత్రమే

తెలుగులో రెండు, మూడు సినిమాలు మాత్రమే

సుమన్‌ రంగనాథ్‌ మాట్లాడుతూ ‘‘నేను తెలుగులో రెండు మూడు సినిమాలు చేశాను. మళ్ళీ తెలుగులో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో కథే హీరో'' అన్నారు.

నిజంగానే పార్టీలా సినిమా

నిజంగానే పార్టీలా సినిమా

హరితేజ మాట్లాడుతూ ‘‘నిజంగానే పార్టీలా ఉంటుందీ సినిమా. చక్కగా, హాయిగా మూడు గంటలు ఎంజాయ్‌ చేసే సినిమా అవుతుంది. ప్రేక్షకులు అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఒక అమ్మాయి జీవితంలో పార్టీలు, సరదాలు, ఫన్‌ ఒక స్టేజ్‌ తర్వాత అయిపోయాక... బాధ్యతలు పెరిగాక... వాటి నుంచి మళ్ళీ ఒక టీనేజ్‌లోకి వచ్చే స్టోరీ ఎంత గమ్మత్తుగా ఉంటుందో? అక్కడ స్నేహితులు ఎలా ఉంటారో? అనే విషయాలు సినిమాలో చూడొచ్చు. నేను చెప్పింది సినిమాలో ఇసుక రవ్వంతే. ఇంకా చాలా ఉంది'' అన్నారు.

సాంకేతిక వర్గం

సాంకేతిక వర్గం

ఈ చిత్రానికి సంగీతం: సిద్దార్థ సదాశివుని,

సాహిత్యం: రాకేందు మౌళి, చైతన్య ప్రసాద్‌, కిట్టు విస్సాప్రగడ,

ఎడిటర్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌,

కెమెరా: సాయిశ్రీరామ్‌,

ఆర్ట్‌: రామ్‌కుమార్‌,

కోరియోగ్రఫీ: యాని, శివ తుర్లపాటి,

పీఆర్వో: ‘బియాండ్‌ మీడియా' ఫణి - నాయుడు,

ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎస్‌. రమణారెడ్డి,

సహ నిర్మాత: శివ తుర్లపాటి,

నిర్మాత: భోగేంద్ర గుప్తా,

కథ-మాటలు-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుందర్‌ పవన్‌.

English summary
Kitty Party' is a strictly women-centric movie written and directed by Sundar Pavan. It stars Bhagyasri, Madhubala, Sada, Suman Ranganathan, Deepthi Bhatnagar, Hariteja, Pooja Jhaveri and Harshavardhan Rane in the lead roles.The promising film's logo was launched today (Wednesday) at Annapurna Studios. The main cast members and others graced the occasion.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more