twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫాన్స్‌ని రావద్దని చెప్పా, బాధగానే ఉంది.. ‘భాయ్’ ఆడియో వేడుకలో నాగార్జున

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కింగ్ నాగార్జున హీరోగా, వీరభద్రం చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన 'భాయ్' చిత్రం ఆడియో వేడుక సోమవారం హైదరాబాద్‌లో చాలా సింపుల్‌గా జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ....'భాయ్ ఆడియో ఇంత సింపుల్‌గా చేయడం బాధగానే ఉందని వ్యాఖ్యానించారు.

    'నా పుట్టిన రోజుకు కూడా ఫ్యాన్స్‌ని రావద్దని చెప్పాను. 'భాయ్' ఆడియో వేడుక గ్రాండ్‌గా చేయాలనే ఉద్దేశ్యంతో...అందరినీ అప్పుడే రావాలని చెప్పాను. కానీ ఆడియో వేడుక గ్రాండ్‌గా చేయలేక పోయాం. ఇలా సింపుల్‌గా చేయడం బాధగానే ఉంది. ఈ సినిమా ఆడియో వేడుకలో నేను, హీరోయిన్లు డాన్సులు చేద్దామని అనుకున్నాం. అదీ కూడా కుదర్లేదు' అని నాగార్జున చెప్పాకొచ్చారు.

    గతంలో మన్మథుడు, మాస్, కింగ్ చిత్రాలకు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్....'భాయ్' చిత్రానికి కూడా అదరగొట్టాడని నాగార్జున తెలిపారు. వీరభద్రం చౌదరి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. ఆయనకు 'భాయ్' సినిమా హాట్రిక్ అవుతుందనే నమ్మకం ఉంది. సెన్సార్ పూర్తయితే ఈ నెల 25నే సినిమాను విడుదల చేస్తామని నాగార్జున తెలిపారు

    వీరభద్రం చౌదరి

    వీరభద్రం చౌదరి


    ‘భాయ్' సినిమా గురించి దర్శకుడు వీరభద్రం చౌదరి మాట్లాడుతూ....నాగార్జున గారి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఏడేళ్ల క్రితమే కథ రాసుకున్నాను. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్సవుతుంది అన్నారు. రతన్ బాబు, సందీప్‌ని ఈ సినిమాతో డైలాగ్ రైటర్లుగా పరిచయం చేస్తున్నాం' అన్నారు.

    రీచా గంగోపాధ్యాయ్

    రీచా గంగోపాధ్యాయ్


    హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్ మాట్లాడుతూ....ఈ చిత్రంలో నేను రాధిక పాత్రలో నటించాను. నా గత పాత్రలకన్నా భిన్నమైన పాత్ర. కామోడీ కూడా చేసారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో నాగార్జున‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది అని తెలిపారు.

    భాయ్

    భాయ్


    డమరుకం తర్వత నాగార్జున నటించిన సినిమాలేవీ రాక పోవడంతో ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. పూలరంగడు, అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీచాగోపాధ్యాయ్ హీరోయిన్. యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ ఆడియన్స్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు.

    నటీనటులు

    నటీనటులు


    ఈ చిత్రంలో సోనూ సూద్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, షాయాజీ షిండే, ఆదిత్య మీనన్, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు, ప్రసన్న, జయప్రకాష్ రెడ్డి, అజయ్, నథాలియా కౌర్, కామ్న జఠ్మలానీ, హంసా నందిని, నాగినీడు, జారాషా, వినయప్రసాద్, సంధ్యా ఝనక్, చలపతిరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, రాహుల్ దేవ్, వెన్నెల కిషోర్, పృథ్వి, దువ్వాసి మోహన్, శ్రావణ్, సుప్రీత్, ప్రభాస్ శ్రీను, కాశీ విశ్వనాథ్, హేమ, రజిత, గీతాంజలి, టార్జాన్, నర్సింగ్ యాదవ్, ఫిష్ వెంకట్ తదితరులు నటించారు.

    సాంకేతిక విభాగం

    సాంకేతిక విభాగం


    ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్.సాయిబాబు, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, మాటలు: సందీప్, రత్న బాబు, కళ: నాగేంద్ర, యాక్షన్: విజయ్ డ్రాగన్ ప్రకాష్, నృత్యాలు: బృందా, గణేష్ స్వామి, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, మాటలు: రత్ బాబు, సందీప్, కథ-దర్శకత్వం: వీరభద్రం చౌదరి.

    English summary
    
 Telugu Movie Bhai Audio Launch Function held at Hyderabad. Akkineni Nagarjuna, Richa Gangopadhyay, Director Veerabhadram Chowdary, Anantha Sriram, cinematographer Sameer Reddy and others graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X