ఆగస్టు 16న ‘భాయ్’ టీజర్ విడుదల
హైదరాబాద్ : అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో వీరభద్రం దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'భాయ్'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో టీజర్‌ను 16న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్.సాయిబాబు మాట్లాడుతూ...'భాయ్' ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈచిత్రానికి సంబంధించిన టీజర్ ఆగస్టు 16న సాయంత్రం 8 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ అఫిషియల్ యూ ట్యూబ్ ఛానల్‌లో విడుదల చేస్తున్నాం. సెప్టెంబర్ 1న ఆడియో రిలీజ్ చేసి, సెప్టెంబర్లో సినిమాను విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నాం' అన్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చిత్రంగా 'భాయ్' రూపొందింది. ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న రేంజిలోనే ఈ చిత్రం ఉంటుంది. అలాగే దర్శకుడు వీరభద్రంకి ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుందని తెలిపారు. కింగ్ నాగార్జున, రీచా గంగోపాధ్యాయ్, నథాలియా కౌర్, కామ్నా జెఠ్మలానీ, హంసా నందిని, సోనూ సూద్, ఆశీష్ విద్యార్థి, బ్రహ్మానందం, షాయాజీ షిండే, ఆదిత్య మీనన్, సుప్రీత్, అజయ్, ఎం.ఎస్.నారాయాణ, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు,
నాగినీడు, జరాసా, వినయప్రసాద్, సంధ్యా, ఝనక్ ప్రసాద్, చలపతి, రాహుల్ దేవ్, వెన్నెల కిషోర్, ప్రసన్న, ప్రభాస్ శ్రీను, కాశీ విశ్వనాథ్, హేమ, రజిత, గీతాంజలి, టార్జాన్, నర్సింగ్ యాదవ్, ఫిష్ వెంకట్, పృథ్వి, దువ్వాసి మోహన్, శ్రావణ్ తదితరులు ఈచిత్రంలో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సమీర్ రెడ్డి, మాటలు : సందీప్, రత్నబాబు, పాటలు : రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, అడిషనల్ డైలాగ్స్ : ప్రవీణ్, శృతిక్, ఫైట్స్ : విజయ్, డ్రాగన్, ప్రకాష్, ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ : నాగేంద్ర, డాన్స్ : బృంద, గణేష్ స్వామి, అడిషనల్ స్క్రీన్ ప్లే : విక్రమ్ రాజ్, కో-డైరెక్టర్ : గంగాధర్ వర్దినీడి, కాస్ట్యూమ్స్ : పి.శేఖర్ బాబు, ఎస్.కె.ఫిరోజ్, మేకప్, గడ్డం శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎన్. సాయిబాబు, నిర్మాత : అక్కినేని నాగార్జున, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : వీరభద్రం.


Click it and Unblock the Notifications











