twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్యాంకాక్ లో నాగార్జున దాదాగిరీ

    By Srikanya
    |

    హైదరాబాద్ : బ్యాంకాక్ కి తెలుగు పరిశ్రమకు అవినాభావ సంభందం ఉన్నట్లుంది. బ్యాంకాక్ లొకేషన్ ని ఇవివి సత్యనారాయణ మొదలు పెడితే పూరీ జగన్నాధ్ పాపులర్ చేసారు. ఇప్పుడు మిగతా దర్శకులు కూడా బ్యాంకాక్ ని తమ చిత్రాలకు బ్యాక్ డ్రాప్ గానూ, మేజర్ లొకేషన్ పాయింట్ గానూ ఎన్నుకుంటున్నారు. తాజాగా నాగార్జున భాయ్ చిత్రం కూడా అక్కడ షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ నాగార్జున భాయ్ గా..అంటే డాన్ గా కథ నడుస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు భాయ్ చిత్రం యూనిట్ నిన్న సాయింత్రం బ్యాంకాక్ బయిలు దేరి వెళ్లిపోయింది.

    సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అహనా పెళ్లంట,పూల రంగడు చిత్రాలతో కామెడీ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న వీరభద్రమ్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. పూర్తి స్ధాయి కామెడీతో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. రిచా గంగోపాధ్యాయ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. మరో సూపర్ హిట్ ఇస్తానని వీరభధ్రమ్ పూర్తి స్ధాయి నమ్మకంతో ఉన్నాడు.

    నాగార్జున ఈ చిత్రం గురించి మాట్లాడుతూ....భాయ్ చిత్రం సీరియస్‌గా వుండే దావుద్ ఇబ్రహీం లాంటి కథ అని భావిస్తున్నారని, కానీ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం ఉంటుందని ఆయన వివరించారు. అలాగే'భాయ్' పేరుతో వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి నిజమే, కాని అది మాఫియా నేపథ్యం కాదు. 'హలో బ్రదర్' సినిమా తరహాలో పూర్తి వినోదాత్మకంగా వుంటుంది. ఇందులో నా పాత్ర 'కింగ్'లో బొట్టు శ్రీనులా వినోదాన్ని పంచుతుంది అన్నారు.

    దర్శకుడు వీరభద్రమ్ చౌదరి చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వించే చక్కటి హాస్య చిత్రమిది. 'హలో బ్రదర్' తరహాలో నాగార్జున పాత్ర చిత్రణ వుంటుంది. ఇందులో నాగార్జున మాఫియా డాన్ పాత్రను చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు మాఫియా అనే అంశమే ఈ చిత్రంలో వుండదు. నాగార్జున సంభాషణలు, మేనరిజమ్స్ సరికొత్త పంథాలో వుంటాయి. ఆయన అభిమానుల్ని అలరించే అంశాలన్నీ 'భాయ్'లో వున్నాయి' అన్నారు.

    English summary
    Nagarjuna, Richa Gangopadhyaya's ‘Bhai’ film unit is flying to Bangkok this evening for its next schedule. Devi Sri Prasad is the music director and Sameer Reddy is the cinematographer for the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X