నాగార్జున ‘భాయ్’కి ముహూర్తం ఖరారు

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ సెప్టెంబర్లో షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉంటుందన్నారు. అదే విధంగా యాక్షన్, కామెడీ మిళితమై ఉంటుందన్నారు. ఇప్పటికే స్ర్కిప్టు వర్క్ పూర్తయిందని, కింగ్ నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని వీరభద్రం చౌదరి తెలిపారు.
నా గత రెండు చిత్రాలకంటే అద్భుతంగా ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు చెబుతున్నాడు. ఆయన మాటలను బట్టి అహ నా పెళ్లంట, పూలరంగడు చిత్రాలను మించిన ఎంటర్ టైన్మెంట్ ఈచిత్రంలో మనకు లభిస్తుందని చెప్పొచ్చు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: నాగార్జున, దర్శకత్వత్వం: వీరభద్రం చౌదరి.
ప్రస్తుతం నాగార్జున నటించిన షిరిడి సాయి, డమరుకం చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. షిరిడి సాయి చిత్రం షిరిడి సాయిబాబా చరిత్ర ఆధారంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందింది. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన చిత్రం 'డమరుకం'.


Click it and Unblock the Notifications











