నాగార్జున పుట్టినరోజుకి ‘భాయ్’
సినిమా సంగతుత్లోకి వెళితే...
యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ ఆడియన్స్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హంసా నందిని, కామ్న జెఠ్మలానీ, నథాలియా కౌర్, సోనూసూద్, ఆశిష్ విద్యార్థి, అజయ్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటిస్తున్నారు.
నథాలియా 'భాయ్' చిత్రంలో ఐటం సాంగులో అందాల విందు చేయనుంది. ఈ పాటను మాంచి మాస్ మసాలా దట్టించి యమ సెక్సీగా రూపొందించారు. ఈ పాటలో నాగార్జున గెటప్ కూడా వెరైటీగా ఉండనుంది. ఆమె అందాలను జుర్రుకునే మొనగాడిలా, అరబ్ షేక్ గెటప్ లో నాగార్జున కనిపించనున్నారు.
ఇక ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో పాత బస్తీ వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేకంగా సెట్‌ని తీర్చిదిద్దారు. ఇక్కడ చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయి. నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని దర్శకుడు వీరభద్రం చౌదరి అంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: నాగార్జున, దర్శకత్వత్వం: వీరభద్రం చౌదరి.


Click it and Unblock the Notifications












