నాగ్ ‘భాయ్’ ఫస్ట్ లుక్ డేట్ ఖరారు
హైదరాబాద్ : అక్కినేని నాగార్జున నటిస్తున్న 'భాయ్' చిత్రం ఫస్ట్ లుక్ ని ఆగస్టు 9న విడుదల చేయనున్నారు. దర్శకుడు వీరభద్రమ్ ఈ విషయం ఖరారు చేసి తెలిపారు. అలాగే ఆడియో ఆగస్టు 16న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంమై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ... 'రెండున్నర గంటలు సంపూర్ణ హాస్యంతో ప్రేక్షకుల్ని అలరించే చిత్రమిది. అందరికీ అభయమిచ్చే 'భాయ్'గా నాగార్జున నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది. రొమాన్స్‌తో పాటు వినోదాన్ని పండించడంలో నాగార్జునగారు ఎంతో ప్రత్యేకతను కనబరుస్తారు. ఇందులో ఆయన శైలి వినోదం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. నాగ్-రిచా గంగోపాధ్యాయ జోడీ కన్నులపండువగా వుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని చెల్లెలి సెంటిమెంట్ ప్రేక్షకుల హృదయాల్ని కట్టిపడేస్తుంది. గతంలో నాగార్జున సిస్టర్ సెంటిమెంట్‌తో చేసిన 'హలో బ్రదర్' 'సీతారామరాజు' 'ఆజాద్' చిత్రాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సెంటిమెంట్‌ను ఈ సినిమా పునరావృతం చేస్తుంది' అన్నారు.
ప్రస్తుతం 'భాయ్' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించే సాంగు చిత్రీకరణతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. డమరుకం తర్వత నాగార్జున నటించిన సినిమాలేవీ రాక పోవడంతో ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. పూలరంగడు, అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీచాగోపాధ్యాయ్ హీరోయిన్. యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ ఆడియన్స్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హంసా నందిని, కామ్న జెఠ్మలానీ, నథాలియా కౌర్, సోనూసూద్, ఆశిష్ విద్యార్థి, అజయ్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటిస్తున్నారు.
నథాలియా 'భాయ్' చిత్రంలో ఐటం సాంగులో అందాల విందు చేయనుంది. ఈ పాటను మాంచి మాస్ మసాలా దట్టించి యమ సెక్సీగా రూపొందించారు. ఈ పాటలో నాగార్జున గెటప్ కూడా వెరైటీగా ఉండనుంది. ఆమె అందాలను జుర్రుకునే మొనగాడిలా, అరబ్ షేక్ గెటప్ లో నాగార్జున కనిపించనున్నారు. ఇక ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో పాత బస్తీ వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేకంగా సెట్‌ని తీర్చిదిద్దారు. ఇక్కడ చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయి. నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని దర్శకుడు వీరభద్రం చౌదరి అంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: నాగార్జున, దర్శకత్వత్వం: వీరభద్రం చౌదరి.


Click it and Unblock the Notifications












