For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    700 ఏళ్ల పురాతన కోటలో నాగ్ ‘భాయ్’ షూటింగ్

    By Bojja Kumar
    |

    కింగ్ నాగార్జున నటిస్తున్న 'భాయ్' చిత్రం షూటింగ్ 700ఏళ్ల చరిత్ర కలిగిన స్లోవేనియాలోని ఓ కోటలో జరుగుతోంది. ఇక్కడ ఈ సినిమాకు సంబంధించిన పాటలను ఇటీవల చిత్రీకరించారు. పిక్చరైజేషన్‌కు బాగా పాపులర్ అయిన ఈ కోటలో చిత్రీకరణ జరుపడం చర్చనీయంశం అయింది.

    ఆకోటలో చిత్రీకరణకు సంబంధించిన అనుభవాలను నాగార్జున వివరిస్తూ...'700 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రెడ్జ్మా కోటలో షూటింగ్ జరిగింది. మొదట సాంగును ఐస్ లాండ్‌లో చిత్రీకరించాలని అనుకున్నాం. కానీ ప్రయోగాత్మకంగా ఇక్కడ ప్లాన్ చేసాం. ఈ లొకేషన్ చాలా బాగుంది. సినిమాలో కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది' అని తెలిపారు.

    Bhai

    పూలరంగడు, అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీచాగోపాధ్యాయ్ హీరోయిన్. యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ ఆడియన్స్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హంసా నందిని, కామ్న జెఠ్మలానీ, నథాలియా కౌర్‌, సోనూసూద్, ఆశిష్‌ విద్యార్థి, అజయ్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు నటిస్తున్నారు.

    నథాలియా 'భాయ్' చిత్రంలో ఐటం సాంగులో అందాల విందు చేయనుంది. ఈ పాటను మాంచి మాస్ మసాలా దట్టించి యమ సెక్సీగా రూపొందించారు. ఈ పాటలో నాగార్జున గెటప్ కూడా వెరైటీగా ఉండనుంది. ఆమె అందాలను జుర్రుకునే మొనగాడిలా, అరబ్ షేక్ గెటప్ లో నాగార్జున కనిపించనున్నారు.

    ఇక ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో పాత బస్తీ వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేకంగా సెట్‌ని తీర్చిదిద్దారు. ఇక్కడ చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయి. నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని దర్శకుడు వీరభద్రం చౌదరి అంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: నాగార్జున, దర్శకత్వత్వం: వీరభద్రం చౌదరి.

    English summary
    Bhai shoots at Predjama Castle. Nag says, "I had some fantastic moments while shooting for a song sequence in the 700 years-old Predjama Castle. Earlier we planned to shoot the song sequences in Iceland but was worth an experiment shooting in this location. It turned out to be far more suited to the sequence.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X