twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భైరవగీత ప్రీరిలీజ్ ఈవెంట్: నాగార్జున జపం చేసిన వర్మ.. శివతో పోల్చుతూ సీన్ చూపించేశారు!

    |

    రాంగోపాల్ వర్మ ఎలాంటి చిత్రాన్ని తెరకెక్కించిన వివాదంలో చిక్కుకోవడం ఖాయం. వర్మ ఎంచుకునే కథలు అలా ఉంటాయి. ఈ మధ్య వర్మ తెరక్కించిన చిత్రాలన్నీ వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం వర్మ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం భైరవ గీత. ఈ చిత్రానికి సిద్ధార్థ్ దర్శకుడు. రాయాలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో క్రైమ్, లవ్ అంశాలతో భైరవ గీత చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ అందరిని ఆకర్షించింది. నవంబర్ 30 న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో నేడు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లో వర్మ ప్రసంగిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

    భైరవ గీత చాలా ప్రత్యేకం

    భైరవ గీత చాలా ప్రత్యేకం

    భైరవ గీత చిత్రం తనకు చాలా ప్రత్యకం అని వర్మ తెలిపారు. చాలా మంది అనుకుంటున్నట్లు ఈ చిత్ర దర్సకుడు సిద్ధార్థ్ తనకు అసిస్టెంట్ డైరెక్టర్ కాదని వర్మ తెలిపారు. తన చిత్రాల్లో ఒకదానికి సిద్ధూ అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేశాడని తెలిపారు. ఎవరి వద్ద అసిటెంట్ గా పనిచేయకుండా డైరెక్టర్స్ గా మారిన కొద్దిమందిలో సిద్దు కూడా ఒకరని వర్మ తెలిపారు. అప్పట్లో తాను, మణిరత్నం లాంటి వాళ్ళం ఎవరి వద్ద అసిస్టెంట్ గా పనిచేయకుండానే దర్శకులం అయ్యాం అని వర్మ తెలిపాడు.

    కడప వెబ్ సిరీస్

    కడప వెబ్ సిరీస్

    తాను కడప వెబ్ సిరీస్ చేస్తున్న సమయంలో సిద్దూ బైరవగీత చిత్ర ప్రపోజల్ నాముందు ఉంచాడు. సిద్దు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాదు. పైగా పర్సనాలిటీ కూడా లేదు. అసలు ఇతడు డైరెక్ట్ చేయగాలడా లేదా అనే అనుమానం కలిగింది. కానీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగానే నేను షాక్ కి గురయ్యానని వర్మ తెలిపాడు. అతడు తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు నాకు పాఠం లాంటివి అని వర్మ ప్రశంసించారు.

    నాగార్జున జపం

    నాగార్జున జపం

    ఈ చిత్రంలో చాలా మంది కొత్త నటీనటులు ఉన్నారు. వాళ్ళందరి వద్ద నుంచి ఇలాంటి అవుట్ పుట్ రాబట్టడం సాధారణమైన విషయం కాదు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా వర్మ నాగార్జున జపం చేశారు. శివ చిత్రంలో ఓ సన్నివేశంతో పోల్చుతూ భైరవగీత చిత్రంలోని సన్నివేశాన్ని చూపించారు.

    అక్కడ జీపులో.. ఇక్కడ ట్రాక్టర్‌లో

    అక్కడ జీపులో.. ఇక్కడ ట్రాక్టర్‌లో

    శివ చిత్రంలో నాగార్జున ఓ రౌడీని చంపి వర్షంలో తడుస్తూ జీపులో రఘువరన్ ఇంటికి చేరుకుంటాడు. అతడి వద్దకు వెళ్లి వార్నింగ్ ఇస్తాడు. భైరవగీతలో కూడా అల;అలాంటి సన్నివేశమే ఉంది. కాకపోతే ఇక్కడ హీరో ధనుంజయ ట్రాక్టర్ లో వస్తాడు. ఈ సన్నివేశం చూసి సిద్దూ ప్రతిభకు షాక్ అయ్యానని వర్మ తెలిపాడు.

    English summary
    Bhairava Geetha Pre Release Event RGV speech. Varma about Siva and Bhairava Geetha movies
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X