ఐశ్వర్య రాయ్ కు ఆడపిల్ల పుడుతుందేమోనని మూర్ఖంగా..
భ్రూణ హత్యలు పెరిగిపోవడానికి అమితాబ్ లాంటి మూర్ఖులే కారణమని ఘాటుగా విమర్శిస్తూ కామెంట్స్ చేసింది భైరవి గోస్వామీ అనే మోడల్. ఐశ్వర్యారాయ్ తల్లికాబోతుందన్న ఈ సమయంలో మరో వివాదం తెరమీదకు వచ్చింది. భేజా ఫ్రై చిత్రంలో నటించిన ఈ అప్ కమింగ్ ఆర్టిస్టు ఇలా ట్విట్టర్ లో అమితాబ్ ని ఆడిపోసుకుంది. వారి ఫ్యామిలీలో హిపోక్రసీ తారాస్థాయికి చేరిందని మండిపడుతోంది. అంతేగాక బచ్చన్లు అడపిల్ల వద్దనుకుని మగసంతానం కోసం ప్రత్యేకంగా బ్యాంకాక్ వెళ్లి మగపిల్లల్ని మాత్రమే పుట్టించే ఐవీఎఫ్ ఇన్స్టిట్యూట్ లో ఐష్ కి వైద్యం చేయిస్తున్నారని ఆరొపిస్తోంది.
వాళ్లకెవరు కావాలో వాళ్లనే పుట్టించుకోవడం వాళ్లిష్టం కానీ ..మీడియాకి మాత్రం ఆడపిల్ల కావాలని కోరుకుంటున్నామని చెప్పడం సిగ్గుచేటని అంటోంది..ఇలాంటివారి వల్లే ఆడపిల్లల్ని పుట్టకముందే చంపేస్తున్నారని..భ్రూణ హత్యలు పెరిగిపోవడానికి ఇటువంటి మూర్ఖులే కారణమని ఘాటుగా విమర్శించింది.అయితే ఆమె తన మీద పరువు నష్టం దావా వంటివి పడకుండా తెలివిగా ఎక్కడా ఐశ్వర్య పేరుగాని,అమితాబ్ పేరు కానీ వాడలేదు.


Click it and Unblock the Notifications











