సునీల్ ‘భక్త కన్నప్ప’ ఆ టైపు కాదట!

హైదరాబాద్: 'భక్త కన్నప్ప'గా సునీల్ నటించబోతున్నాడనే విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహించబోతున్నారు. కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ మర్యాద రామన్న, పూల రంగడు చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు అల్లరి చిల్లర పాత్రల్లో నటించిన సునీల్ త్వరలో విభిన్నమైన పాత్రలో తెరపై కనిపించబోతున్నాడు. మే 2వ వారం నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

తనికెళ్ల భరణి పరిశ్రమలో సినీయర్ నటుడు, రచయిత కూడా. ఆయన దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'మిథునం' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సునీల్‌తో భక్త కన్నప్ప చిత్రాన్ని ఆయన తనదై ప్రత్యేక శైలిలో తెరకెక్కిస్తారనే నమ్మకం పలువురు పరిశ్రమ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు.

'Bhakta Kannappa' not a mythological film

గతంలో కృష్ణం రాజు హీరోగా 'భక్త కన్నప్ప' అనే భక్తిరస చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సునీల్ నటిస్తున్న 'భక్త కన్నప్ప' చిత్రం మాత్రం భక్తి చిత్రం కాదట. ఇదొక గిరిజన ప్రేమ కథా చిత్రమని, తాను ఈ చిత్రంలో గిరిజన యువకుడి పాత్ర పోషిస్తున్నట్లు సునీల్ తెలిపారు.

తను చేస్తున్న ఇతర ప్రాజెక్టుల గురించి సునీల్ మాట్లాడుతూ...భక్త కన్నప్ప చిత్రంతో పాటు మరో రెండు పెద్ద సినిమాల్లో నటిస్తున్నట్లు సునీల్ తెలిపారు. విక్కీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడంతో పాటు, రచయిత గోపీ మోహన్ దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X