ప్రభాస్‌తో ‘భక్త కన్నప్ప’ రీమేక్
హైదరాబాద్ : భగవంతుని అనుగ్రహం ఉంటే ప్రభాస్‌తో కలిసి 'భక్తకన్నప్ప' సినిమా మళ్లీ తీయనున్నట్లు సినీనటుడు కృష్ణంరాజు పేర్కొన్నారు. ముక్కంటీశుని దర్శనార్థం ఆయన కుటుంబసమేతంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక రాహు, కేతు పూజలు చేయించారు.
దర్శనానంతరం మాట్లాడుతూ ''భక్తులు... భగవంతునికి వివిధ రీతుల్లో మొక్కులు తీర్చుకుంటారు. అచంచల భక్తికి 'భక్తకన్నప్ప' చిత్రం నిదర్శనం. అంతటి భక్తుని గురించి తీసిన సినిమాలో నేను నటించడం మరచిపోలేను. ఎన్నో శివాలయాలు ఉన్నా, ఇక్కడి ఆలయం మాత్రం ఎంతో ప్రత్యేకం. 'భక్తకన్నప్ప' సినిమా తీసే సమయానికి, ఇప్పటికీ ఆలయంలో చాలా మార్పులు వచ్చాయి. ఎంతగానో అభివృద్ధి చెందింది'' అని తెలిపారు.
దాదాపు 36 ఏళ్ల క్రితం శ్రీకాళహస్తీశ్వరాలయంలో తాను తీసిన 'భక్త కన్నప్ప' చిత్రాన్ని అభిమానులు ఎంతగానో ఆదరించారని, ఈ చిత్రం తనకు అప్పట్లో ఎంతో పేరు తెచ్చిందని గుర్తు చేసుకున్నారు.అదే చిత్రాన్ని ఇప్పుడు ప్రభాస్‌తో తీయనున్నట్టు చెప్పారు. లంచగొండి నిర్మూలనపై తాను 'మనవూరి పాండవులు' తరహా చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.
సమాజంలో లంచగొండితనం ఎక్కువైందని, దీన్ని నియంత్రించడంతో పాటు ప్రజలను చైతన్యవంతులను చేసేలా 'మన ఊరి పాండవులు' చిత్రాన్ని తీస్తున్నట్లు వివరించారు. తనను ఆదరించినట్లే ప్రభాస్‌ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని సందేశాత్మక చిత్రాలు తీయడానికి కృషి చేస్తానన్నారు. రాజకీయాలపై సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.


Click it and Unblock the Notifications











