నవదీప్, నవీన్ చంద్ర ‘భమ్ భోలేనాథ్’ ఫస్ట్ లుక్
నవదీప్, నవీన్ చంద్ర ప్రధాన తారాగణంగా ఆర్.సి.సి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో సిరివూరి రాజేష్‌వర్మ రూపొందిస్తున్న చిత్రం ‘భమ్ బోలేనాథ్'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో దర్శకుడు చందు మొండేటి విడుదల చేశారు.

నవీన్ మాట్లాడుతూ...ఈ సినిమాకి పనిచేసినవారందరూ యూత్ కావడంతో సరదా సరదాగా చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిందని, మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు. కథను నమ్మి ఈ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం నిర్మాత ఇచ్చారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి క్రైమ్, కామెడీ థ్రిల్లర్‌గా రూపొందించానని దర్శకుడు కార్తీక్ వర్మ అన్నారు. నవంబర్ నెలాఖరులోనే ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పూజా ఝవేరి, ప్రదీప్, పోసాని కృష్ణమురళి, పంకజ్ కేసరి, ప్రాచి, శ్రేయ, కిరీటి, ప్రవీణ్, నవీన్, తా.రమేష్, ధన్‌రాజ్, పృధ్వి, కాదంబరి కిరణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:సాయికార్తీక్, కెమెరా:్భరణి కె.్ధరణి, మాటలు:శరణ్ కొప్పిసెట్టి, కార్తీక్‌వర్మ దండు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, నిర్మాత: సిరివూరి రాజేష్ వర్మ, దర్శకత్వం: కార్తీక్ వర్మ దండు.


Click it and Unblock the Notifications











