ఆమె జూనియర్ నయనతార!?
ఆమె ఏమీ నయనతారకి డూప్ కాదు. కానీ ఇప్పుడు జూనియర్ నయనతార అని మళయాళ మీడియా చేత పిలవబడతూ వరస ఆఫర్స్ పొందుతోంది. ఆమె మరెవరో కాదు విశాల్ తమిళ డబ్బింగ్ చిత్రం భరణి హీరోయిన్ భాను. ఆ మధ్య తన తండ్రే తనకు త్రాచుపాములా మారాడంటూ గొడవ చేసి మీడియా కెక్కిన ఆమె తర్వాత త్వరగానే సెటిలయ్యింది. ఇంతకీ మరో విషయం ఏమిటంటే ఆమె నయనతారకు వీరాభిమాని. నయనతారతో కలిసే అవకాశమొస్తే ఆపకుండా ముద్దులు పెడతానంటూ చెప్పే ఆమె నటనలో ఆమెను అనుకరిస్తానంటోంది. తమిళ, తెలుగు, మళయాళ భాషల తేడాలేకుండా నటిస్తాననే ఆమె తెలుగు వైపు ఆశగా చూస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడే నయనతార సెటిలవటం ఆమెను కూడా ప్రేరణిస్తోందని అంటున్నారు. ఇంతకీ ట్విస్ట్ ఏమిటంటే నయనతారని ఓ తమిళ సినిమా పత్రిక విలేఖరి భాను మీ అభిమాని తెలుసా అంటే ఆమెవరు అని ముఖం చిట్లించింది.
bhanu junior nayantara malayalam vishal bharani nayantara media tamil dubbing నయనతార మళయాళ మీడియా జూనియర్ నయనతార విశాల్ భరణి


Click it and Unblock the Notifications