పులి హీరోయిన్ పేరు బయటపెట్టిన భాను

By Bojja Kumar

సూరి హంతకుడు భాను కిరణ్‌కు సినీ రంగానికి చెందిన పలువురితో సంబంధాలు ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొందరు హీరోయిన్లతో భాను సన్నిహితంగా మెలిగేవాడని, పోలీసులు అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాపుల్లో భాను కొందరు హీరోయిన్లతో చాలా క్లోజ్‌గా దిగిన ఫోటోలు ఉన్నాయనద వార్తలు అప్పట్లో వినిపించాయి. అయితే వారు ఎవరు? వారికి క్రిమినల్ భానుకు మధ్య అంత సాన్నిహిత్యం ఏమిటి? అనే అంశాలు మీడియాలో భారీ చర్చకు దారి తీశాయి కూడా...

తాజాగా పోలీసులకు చిక్కిన భాను పలువురు ప్రముఖ పేర్లతో పాటు ఈ హీరోయిన్ల వ్యవహారం కూడా బయట పెడుతున్నాడు. ఇటీవల సీఐడీ విచారణలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భాను చెప్పి హీరోయిన్ ఎవరో కాదు...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'పులి' చిత్రంలో నటించిన నికీషా పటేల్. పులి షూటింగు సమయంలో నికీషాను కలిశానని భాను వెల్లడించాడు.

దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి నికీషా పటేల్‌పై పడింది. పులి చిత్రానికి నిర్మాతలుగా సింగనమల రమేష్, సి కళ్యాణ్‌లు వ్యవహరించారు. భాను అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే ఈ ఇద్దరు నిర్మాతలు సినిమాలు తీసే వారని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈనేపథ్యంలో భాను నికీషా పటేల్ పేరు బయట పెట్టడంతో ఆ నిర్మాతలే భానును నికిషాకు పరిచయం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

అయితే నికీషా పటేల్ వాదన మాత్రం వేరేలా ఉంది. అసలు భాను ఎవరో కూడా తెలియదని, అతన్ని ఎప్పుడూ చూడలేదని, తనను అనవసరంగా కాంట్రవర్సీల్లోకి లాగొద్దని అంటోంది. పులి చిత్రం పరమ ప్లాపు కావడంతో నికిషా ఆ తర్వాత ఒక్క తెలుగు సినిమాలో కూడా అవకాశం దక్కించుకోలేక పోయింది. ప్రస్తుతం అమ్ముడు తమిళం, కన్నడం, మలయాళంలో చిత్రాలు చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X