Don't Miss!
- Sports KKR vs RR: శతక్కొట్టిన సునీల్ నరైన్.. 19 బౌండరీలతో విధ్వంసం!
- News చంద్రబాబు సమక్షంలోనే బయటపడ్డ విభేదాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్‌ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Lifestyle రామసేతు ఇక ఎప్పటికీ మిస్టరీగానే ఉంటుందా.. శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారంటే..!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
భానుప్రియ జీవితంలో ఊహించని విషాదం.. వెంటాడుతున్న దు:ఖం..
Recommended Video
ఒకప్పటి అందాల నటి భానుప్రియ జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఆమె మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ గుండెపోటుతో అమెరికాలో మృతిచెందారు. కౌశల్ మృతి వార్త విని భానుప్రియ షాక్‌కు గురైనట్లు సమాచారం. ఆ వెంటనే కుమార్తెను తీసుకుని ఆమె అమెరికా బయలుదేరి వెళ్లారు.
ఆదర్శ్ కౌశల్ ఒక ఫోటోగ్రాఫర్..:
వృత్తిపరంగా ఆదర్శ్ కౌశల్ ఒక ఫోటోగ్రాఫర్. 1998, జూన్ లో అమెరికాలోని కాలిఫోర్నియాలో భానుప్రియను ఆయన వివాహం చేసుకున్నారు. అక్కడి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వీరి వివాహం జరిగింది.
వీరి దాంపత్యానికి గుర్తుగా..:
ఆదర్శ్ కౌశల్-భానుప్రియల దాంపత్యానికి గుర్తుగా 2003లో వీరికి ఒక పాప కూడా పుట్టింది. ఇద్దరూ కళా రంగాలకు చెందినవారే కావడం.. కళారంగం పట్ల అమితమైన అభిమానం ఉండటంతో కుమార్తెకు 'అభినయ' అని పేరు పెట్టుకున్నారు.
2005లో విడాకులు:
కుమార్తె పుట్టిన తర్వాత ఆదర్శ్ కౌశల్-భానుప్రియల వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆ తర్వాత రెండేళ్లకే 2005లో భానుప్రియ ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు.
విడాకుల తర్వాత:
భర్తతో విడాకుల అనంతరం భానుప్రియ తిరిగి ఇండియాకు వచ్చేశారు. అప్పటినుంచి కుమార్తెతో పాటు చెన్నైలోనే ఉంటూ.. మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. అడపాదడపా తెలుగు సినిమాల్లోనూ కనిపించారు. అలాగే కూచిపూడి, భరతనాట్యం వంటి కళానృత్యాల్లో చాలామందికి శిక్షణ ఇస్తున్నారు.
భానుప్రియ నిలువెత్తు రూపలావణ్యం..:
అందం, అభినయానికి తోడు సాంప్రదాయ కళానృత్యాల్లో భానుప్రియకు ఉన్న నైపుణ్యం ఆమెకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. వంశీ సినిమాల ద్వారా తెలుగునాట భానుప్రియ ముద్ర చాలామంది గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది.
తెరపై ఆమె నవ్వినా.. కళ్లతోనే హావభావాలు పలికించినా.. ప్రేక్షకులు మైమరిచిపోయారు. రూపలావణ్యానికి నిలువెత్తు నిదర్శనంలా ఉండే భానుప్రియను తెరపై చూడటం ఆరోజుల్లో గొప్ప అనుభూతి అనుభూతి అని ఇప్పటికీ చాలామంది గుర్తుచేసుకుంటారు.