twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ 2.... 15 మంది ఇంటి సభ్యులు నిజస్వరూపం ఇదే!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu : Bhanu Sree Talks About Show Contestants

    బిగ్ బాస్ షో నుండి గత వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన భానుశ్రీ.... ఇంటి సభ్యులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనతో పాటు బిగ్ బాస్ గేమ్ ఆడిన 15 మంది ఇంటి సభ్యుల నిజస్వరూపం ఏమిటి? వారి స్వభావాలు ఎలాంటివి? ఇంట్లో వారి యాటిట్యూడ్ ఎలా ఉండేది? అనే విషయాలు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వూలో వెల్లడించారు. షో చూసే ప్రక్షకులకు వారి గురించి తెలియని చాలా విషయాలు ఆమె వెల్లడించే ప్రయత్నం చేశారు. ఏ మాత్రం మొహమాటం లేకుండా వారిపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు తెలిపింది.

    సంజన మంచిదే..

    సంజన మంచిదే..

    సంజనకు నోరు ఎక్కువ కానీ మంచిదే. ఆమె వాయిస్ కొంచెం రాష్ గా ఉంటుంది. దాన్ని జనాలు యాక్సెప్టు చేయలేదు అనిపించింది. ఇంకో రెండు మూడు వారాలు ఉంటే ఆమె గురించి పూర్తిగా తెలిసేది. ఆమె ఒక వారం మాత్రమే ఉంది కాబట్టి అంత తక్కువ సమయంలో జడ్జ్ చేయలేం.

     బాబు గోగినేని

    బాబు గోగినేని

    బాబు గోగినేనిని అందరూ పెద్దమనిషిగా చూస్తారు. గేమ్ పరంగా ఆయన పనికిరాడు. ఏ టాస్కులోనూ యాక్టివ్ గా ఉండడు. అందరికీ హితబోధనలు ఇస్తుంటాడు. అలా చేసే ముందు ఆయనకు కూడా తనకు తాను హితబోధ చేసుకోవాలి, బిగ్ బాస్ షోకు ఎందుకొచ్చానో అని ప్రశ్నించుకుంటే బావుంటుంది.

    నూతన్ నాయుడు

    నూతన్ నాయుడు

    నూతన్ నాయుడు నాకు అర్థం కాలేదు. ఆయనతో ఎప్పుడూ అంత క్లోజ్ గా మూవ్ అవ్వలేదు. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒక సందర్భంలో అందరూ తనను ఎదురిస్తే గీతా, నేను సపోర్ట్ చేశాం. ఆయన అంత బ్యాడ్ పర్సన్ కాదని నా అభిప్రాయం.

    గణేష్ గురించి

    గణేష్ గురించి

    గణేష్ ఒక్కోసారి బోలా మనిషిలా, అమాయకుడిలా కనిపిస్తాడు. కొన్నిసార్లు టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడుతుంటాడు. కొన్నిసార్లు ఆయన మాట్లాడేవి చాలా తెలివిగా అనిపిస్తాయి.

    సామ్రాట్ భయస్తుడు

    సామ్రాట్ భయస్తుడు

    సామ్రాట్ చూడటానికి మంచి పర్సనాలిటీ వేసుకుని హైట్ ఉంటాడు కానీ, కొంచెం భయస్తుడు అనిపించింది. టాస్క్ లలో స్ట్రాంగ్ పర్సన్. నువ్వా నేనా అన్నట్లు ఆడుతుంటాడు. ఏదైనా ప్రశ్నకు జవాబు ఇవ్వమంటే భయపడుతూ ఉంటాడు.

    తేజుకు అదే పెద్ద మైనస్

    తేజుకు అదే పెద్ద మైనస్

    తేజుకు పెద్ద మైనస్ ఆమె నోరు. ముందు వెనక ఆలోచించకుండా వాగేస్తుంది. ఇతరులను హర్ట్ చేస్తుంది... నేను చేసిందే కరెక్ట్ అని వాదిస్తూ ఉంటుంది. తప్పు చేశాను అని రియలైజ్ అవ్వదు. కొన్ని సార్లు సారీ చెబుతుంది కానీ ఆమె నోరు, యాటిట్యూడ్ ఆమెపై నెగిటివిటీ పెంచుతుంది.

    గీతా మాధురి అయోమయం మనిషి

    గీతా మాధురి అయోమయం మనిషి

    గీతా మాధిరి చాలా కన్‌ఫ్యూజ్ మనిషి. కొన్ని సార్లు తెలివిగా మాట్లాడుతూ ఉంటుంది. కెప్టెన్సీ సమయంలో, ప్రచారం చేసిన సమయంలో తన జెన్యూనిటీ, వ్యవహార శైలి బాగా నచ్చింది. కొన్ని సార్లు ఒకే విషయాన్ని పట్టుకుని వాదిస్తూ ఉంటుంది. ఒక్కోసారి తన డౌట్లతో పిచ్చెక్కిస్తుంది.

    శ్యామల ప్రేమకు లొంగిపోతుంది

    శ్యామల ప్రేమకు లొంగిపోతుంది

    శ్యామల ఎవరు వచ్చి ప్రేమగా మాట్లాడినా లొంగిపోతూ ఉంటుంది. ఎంత చెడ్డవారైనా ఆమె వద్దకు వచ్చి స్వీట్ గా మాట్లాడితే వారిపై మంచి అభిప్రాయం పెంచుకుంటుంది.

    నందినీ రాయ్ యాటిట్యూడ్ నచ్చలేదు

    నందినీ రాయ్ యాటిట్యూడ్ నచ్చలేదు

    నందినీ రాయ్ యాటిట్యూడ్ నాకు నచ్చలేదు. ప్రతీ దానికి ఓవర్ రియాక్ట్ అవుతుంది. ప్రతి వారం నాని వచ్చి ఒక మేసేజ్ ఇస్తారు. దానికి ఆమె మెల్ట్ అయిపోతుంది. ఇంట్లో తన ఒరిజినాలిటీ చూపించకుండా నటిస్తోంది.

    కౌశల్ పది మందిలో కలవని వ్యక్తి

    కౌశల్ పది మందిలో కలవని వ్యక్తి

    కౌశల్ హార్ట్‌ఫుల్‌గా నవ్వడం ఎప్పుడూ చూడలేదు. పది మందిలో కలిసే రకం కాదు. తన పనేదో తాను చేసుకుంటూ ఉంటాడు. ఇంట్లో పని దొంగ. ఆయన మాతో కలిస్తే ఆయన గురించి మరిన్ని విషయాలు తెలిసేవి.

    తనీష్ గురించి

    తనీష్ గురించి

    తనీష్ మంచి ప్లేయర్. కాస్త కోపం ఎక్కువ. ఇపుడు కోపం బాగా తగ్గించుకున్నాడు. దీప్తి సునైన, తనీష్ క్లోజ్‌గా ఉండటం వల్ల జనాల్లో అనుమానాలైతే ఉన్నాయి. ఈ విషయంలో వారే ఒక క్లారిటీ ఇస్తే బావుంటుంది.

    టీవీ9 దీప్తి నిజ స్వరూపం

    టీవీ9 దీప్తి నిజ స్వరూపం

    దీప్తి నల్లమోతు పైకి కనిపించేది ఒకటి... ఆమె మనసులో ఉండేది వేరు అనిపిస్తుంది. ఆమెది డబల్ యాటిట్యూడ్ అనిపిస్తుంది. ఆమె సాఫ్ట్ పర్సనా? హైపర్ యాటిట్యూడ్ పర్సనా? అర్థం కాదు. బిగ్ బాస్ కోసం డబల్ గేమ్ ఆడుతుంది అనిపిస్తుంది.

    రోల్ రైడా

    రోల్ రైడా

    రోల్ రైడా ఎవరూ తనను నెగెటివ్‌గా తీసుకోకుండా సేఫ్ గేమ్ ఆడుతుంటాడు.

    అమిత్ తివారీ

    అమిత్ తివారీ

    అమిత్ తివారీ ఓవర్ మంచితనం అనిపిస్తుంది. కన్‌ఫ్యూజ్ కాకుండా సెటిల్‌గా ఆడితే మరింత బావుంటుంది.

    కిరిటీ గురించి

    కిరిటీ గురించి

    కిరీటి వ్యవహార శైలి, మాట్లాడే తీరు భిన్నంగా ఉంటుంది. అందుకే ఆయనపై గోపి అనే ముద్ర పడింది.

    English summary
    Bhanu Sree opinion about 15 Contestants of Bigg Boss2. Bhanu Sree who was considered strong candidate until two weeks back had to vacate the house last week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X