మొత్తానికి ‘వరుడు’ హీరోయిన్ భానుశ్రీ మెహ్రా బుక్ అయ్యింది
అల్లు అర్జున్ 'వరుడు"చిత్రంతో పరిచయమైన భానుశ్రీ మెహ్రా ఆ తర్వాత ఆమెకు సినిమాలు ఏమీ రాలేదు. తను ఆ సినిమాలో నటించి తప్పు చేసానని ఎంత మొత్తుకున్నా ఆమెకు కెరీర్ ప్రారంభం కాలేదు. అయితే ఇన్నాళ్ళకు ఆమెను ఓ కొత్త బ్యానర్ వారు బుక్ చేసారు. అది ఓ ప్రేమ కథ. రంగా రవీందర్‌గుప్తా దర్శకత్వంలో తిరుమల మూవీ క్రియేషన్స్ పతాకంపై జె.కృష్ణారెడ్డి, జి.వేణుమాధవ్, కె.రాముగౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ద్వారా ఉదయ్‌తేజ్ హీరోగా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రం గురించి భానుశ్రీ మెహ్రా మాట్లాడుతూ -''తెలుగులో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. 'వరుడు" తర్వాత తమిళంలో ఓ సినిమా, హిందీలో ఓ సినిమా చే శాను"" అంది. చంద్రమోహన్, రంగనాథ్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.డి.జాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సంతోష్‌కుమార్.


Click it and Unblock the Notifications











