పవన్ తండ్రిగా...మాజీ హీరో

By Staff

Bhanuchander
పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న కొమురం పులి చిత్రంలో పవన్ కళ్యాణ్ తండ్రిగా మాజీ హీరో భాను చందర్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే మీడియాతో చెప్పారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నెల్లూరు వచ్చిన ఆయన మీడియాతో రాజకీయాలు, సినిమాలపై తన అభిప్రాయాలను వ్యక్తీకరించారు.

ప్రస్తుత రాజకీయాల్లో నాన్‌ వయలెన్స్‌ హీరో ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని ఆయన అన్నారు. అలాగే వాజపేయి బీజేపీలో ఉన్నంత కాలం తాను ఆ పార్టీ అభిమానిగా ఉంటూ పనిచేశానని, అయితే ప్రస్తుతం పార్టీలోని పరిస్థితుల దృష్ట్యా తాను పార్టీకి దూరమయ్యానన్నారు. సినిమాల గురించి ప్రస్తావిస్తూ..ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో కొత్తదనం కానరావడంలేదని భానుచందర్‌ అన్నారు. ఇప్పుడు కూడా నూతనత్వంతో తీస్తున్న చిత్రాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయన్నారు. తనకు నచ్చిన కథలు, పాత్రలు రావడం లేదని, అందుకే టీవీ వైపు దృష్టి సారించానన్నారు.

అలాగే పవన్‌కళ్యాణ్‌ నటించిన 'పులి' చిత్రంలో హీరో తండ్రిగా నటిస్తున్నానన్నారు. నితిన్‌, ఇలియానా జంటగా నటించే చిత్రం షూటింగ్‌ జరుగుతున్నదన్నారు. మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు భానుచందర్ ‌ తెలిపారు. ఇక పవన్ పులి చిత్రాన్ని ఖుషి దర్సకుడు ఎస్.జె.సూర్య రూపొందిస్తున్నారు. ద్విపాత్రల్లో పవన్ ఈ చిత్రంలో కన్పించనున్నారు. ఎ.ఆర్.రహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శింగనమల రమేష్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం మిగతా షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. పవన్ యువరాజ్యం అధ్యక్ష్యుడు హోదాలో ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో పాల్గొనటంతో ఈ చిత్రం ఆలస్యమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X